Twitter X To Charge Annual Fee For New Users : ట్విట్టర్ ఉన్నప్పుడే బాగుండేది కదా. ఎప్పుడైతే ఎలన్ మస్క్ ట్విట్టర్ ను కొన్నాడో అప్పటి నుంచి ట్విట్టర్ వాడే యూజర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్ ఉద్యోగులను కూడా చీమల్లా చూశాడు. అందరినీ పీకేశాడు. తనకు నచ్చిన వాళ్లనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత ట్విట్టర్ లోగో మార్చాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. అసలు ట్విట్టర్ పేరునే తీసేశాడు. దానికి ఎక్స్ అని పేరు పెట్టాడు. బ్లూ టిక్ కావాలంటే డబ్బులు కట్టాలన్నాడు. సంవత్సరానికి డబ్బులు కట్టి మరీ కొందరు బ్లూ టిక్ ను తీసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కొత్త యూజర్లకు కూడా ఎలన్ మస్క్ షాకిచ్చాడు. అవును.. కొత్త యూజర్లు ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక నుంచి ఫ్రీ కాదు. డబ్బులు పే చేయాలి. సంవత్సరానికి కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది.
కాకపోతే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఈ రూల్ ను మన దగ్గర పెట్టడం లేదు. ముందుగా ప్రయోగాత్మకంగా న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మాత్రమే డబ్బులు కట్టడం కాదు. ఏదైనా ట్వీట్ చేయాలన్నా ముందు ఒక డాలర్ చెల్లించి ఆ తర్వాత ట్వీట్ చేసుకోవాలి. ట్విట్టర్ లో ఈ మధ్య ఎక్కువగా స్పామ్ ట్వీట్లు పోస్ట్ అవుతున్నాయట. ఆటోమెటిక్ బాట్స్ ట్విట్టర్ అకౌంట్లను టార్గెట్ చేసుకొని ట్వీట్స్ చేస్తున్నాయట. అటువంటి ట్వీట్లను తగ్గించేందుకే మస్క్ సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది.
Twitter X To Charge Annual Fee For New Users : నాట్ ఏ బాట్ పేరుతో కొత్త ఫీచర్
ట్విట్టర్ నా ఏ బాట్ పేరుతో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. ఎక్స్ లో ఉన్న ఫేక్ ఖాతాలను తొలగించడం, ఫేక్ ఖాతాలు ఓపెన్ కాకుండా చేయడం, స్పామ్ అకౌంట్స్ లేకుండా చేయడం కోసం కృషి చేస్తోంది. దాని కోసం నాట్ ఏ బాట్ అనే ఫీచర్ ను యూజర్స్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అది ఫ్రీ కాదు. దానికి సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకునే వారికే వర్తిస్తుంది.
ఏది ఏమైనా ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్ ను ఉపయోగించాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఎప్పుడు మస్క్ ఎలాంటి మార్పులు చేస్తాడో అని కొందరైతే ఎక్స్ ను వాడటమే మానేశారు. చూడాలి.. భవిష్యత్తులో ఎక్స్ పరిస్థితి ఏమౌతుందో?