twitter to share ad revenue to content creators

Twitter : గత కొన్ని నెలల నుంచి ట్విట్టర్ ట్విట్టర్.. ఇదే సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతోంది. నిజానికి.. లేఆఫ్స్ ను స్టార్ట్ చేసిందే ట్విట్టర్. సోషల్ మీడియాలో సరికొత్త విప్లవాలను తీసుకొచ్చేదే ట్విట్టర్. ఎప్పుడైతే ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతుల్లో పడిందో.. వెంటనే ట్విట్టర్ ను ప్రక్షాళన చేయడం ప్రారంభించారు. రోజుకు కొన్ని కోట్లలో నష్టం వస్తున్న కంపెనీని టేకప్ చేసి దాన్ని దారిలో పెట్టేందుకు మస్క్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. ట్విట్టర్ అకౌంట్ యూజర్లకు డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కూడా మస్క్ కల్పిస్తున్నాడు.

దీనికి సంబంధించి మస్క్ ఓ ట్వీట్ కూడా చేశాడు. ఈరోజు నుంచి యాడ్ రెవెన్యూను ట్విట్టర్ క్రియేటర్స్ కు కూడా షేర్ చేస్తుంది. రిప్లయి థ్రెడ్స్ లో వచ్చే యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ అకౌంట్ యూజర్ కు కొంత షేర్ ఇస్తామని మస్క్ ట్వీట్ చేశాడు. అయితే.. ఎంత షేర్ ఇస్తాడు.. దాని ప్రొసీజర్ ఏంటి.. ఏ కంటెంట్ క్రియేటర్స్ కు అవకాశం ఇస్తారు. దాని కోసం సపరేట్ గా అప్లయి చేసుకోవాలా? లేక ఏంటి అనే విషయాలపై మాత్రం మస్క్ క్లారిటీ ఇవ్వలేదు.

Twitter : బ్లూ టిక్ ఉన్న సబ్ స్క్రైబర్స్ కే ఈ అవకాశం

కాకపోతే బ్లూ టిక్ ఉన్న ట్విట్టర్ అకౌంట్ సబ్ స్క్రైబర్స్ కే ఈ అవకాశాన్ని కల్పిస్తామని ట్విట్టర్ కంపనీ పేర్కొంది. ట్విట్టర్ ఇటీవల మూడు రకాల టిక్స్ ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే కదా. కొంత అమౌంట్ కడితే ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇస్తోంది. నెలనెలా కొంత డబ్బు చెల్లిస్తూ ఉండాలి. అలా.. బ్లూ టిక్ వెరిఫై చేసిన వాళ్లకే రెవెన్యూ షేర్ ఉంటుందని ట్విట్టర్ ప్రకటించింది.

ట్విట్టర్ ఈ మధ్య సడెన్ నిర్ణయాలు తీసుకుంటోంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావడం లేదు. ఎలన్ మస్క్ సీఈవో అయినప్పటి నుంచి ట్విట్టర్ లో పలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రెవెన్యూ షేర్ కూడా దానికి సంబంధించిందే. మస్క్ గత సంవత్సరం అక్టోబర్ లో రూ.3.6 లక్షల కోట్లతో ట్విట్టర్ ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.