Vivo X90 – Vivo X90 Pro : వివో ఫోన్లకు భారత్ లో ఎంత డిమాండ్, క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల అమ్మకాలు సాగిస్తోంది. అయితే.. భారత్ లో వివో ఫోన్ల అమ్మకాలు ఎక్కువ. అందుకే భారత్ లో పలు రకాల మోడల్స్ ను వివో అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. తాజాగా వివో ఎక్స్ 90, వివో ఎక్స్ 90 ప్రో సిరీస్ ను భారత్ లో తీసుకొచ్చేందుకు వివో సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మోడల్ ఫోన్స్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యాయి.
ఈ నెలలోనే వివో ఎక్స్ 90, 90 ప్రో ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఫిబ్రవరిలో ఈ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కాగా.. భారత్ లో ఈ నెలలో రాబోతున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ఎస్వోసీ ప్రాసెసర్ తో ఈ ఫోన్లు రాబోతున్నాయి. అంతకంటే ముందు వివో టీ2 5జీ సిరీస్ ఏప్రిల్ 11న భారత్ లో లాంచ్ కానుంది.
Vivo X90 – Vivo X90 Pro : గత సంవత్సరం నవంబర్ లోనే చైనాలో 90 సిరీస్ లాంచ్
చైనాలో గత సంవత్సరం నవంబర్ లోనే వివో ఎక్స్ 90, వివో ఎక్స్90 ప్రో, వివో ఎక్స్90 ప్రో ప్లస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఆ తర్వాత మలేసియాలో వివో ఎక్స్90, వివో ఎక్స్90 ప్రో ఫోన్లు ఫిబ్రవరిలో లాంచ్ అయ్యాయి. 12 జీబీ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ప్రారంభ ధర రూ.71,600 గా ఉంది.
ఇక వివో ఎక్స్ 90, ఎక్స్ 90 ప్రో స్పెసిఫికేషన్లను చూసుకుంటే.. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఫన్ టచ్ ఓఎస్ 13, 6.78 ఇంచ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ స్క్రీన్, 120 హెచ్ జెడ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్షిటీ 9200 ఎస్వోసీ, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 866 ప్రైమరీ సెన్సార్, 12 ఎంపీ పొట్రెయిట్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 4810 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయి.