Vodafone – Idea : భారత్ లో ఇప్పటికే 5జీ నెట్ వర్క్ లాంచ్ అయింది. గత సంవత్సరమే జియో ట్రూ 5జీ పేరుతో 5జీ సర్వీస్ ను భారత్ లో లాంచ్ చేసింది. జియో తర్వాత ఎయిర్ టెల్ కూడా 5జీ నెట్ వర్క్ ను భారత్ లో లాంచ్ చేసింది. జియో, ఎయిర్ టెల్ తర్వాత వొడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులను భారత్ లో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి.. వొడాఫోన్ యూజర్లు ఎప్పుడెప్పుడా అని 5జీ సర్వీసుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో 5జీ సర్వీసులను తీసుకొస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా 4జీ సర్వీస్ మాత్రమే భారత్ లో అందుబాటులో ఉంది.
5జీ సర్వీస్ లేకపోవడంతో వొడాఫోన్ కస్టమర్లు భారీగా తగ్గిపోతున్నారు. దీంతో 5జీ సర్వీసులను ప్రారంభించేందుకు వొడాఫోన్ ఐడియా ప్లాన్ చేస్తోంది. మోటరోలా, జియోమీ స్మార్ట్ ఫోన్ కంపెనీలతో 5జీ నెట్ వర్క్ కోసం వొడాపోన్ ఐడియా టైఅప్ అయింది. అయితే.. ఎప్పుడు 5జీని భారత్ లో లాంచ్ చేస్తారో మాత్రం ఇంకా కన్ఫమ్ చేయలేదు.
Vodafone – Idea : ఏప్రిల్ 2021 నుచి 42.4 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ను కోల్పోయిన వొడాఫోన్
ఏప్రిల్ 2021 నుంచి ఇప్పటి వరకు వొడాఫోన్ ఐడియా 42.4 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ను కోల్పోయింది. అలాగే.. గత సంవత్సరం డిసెంబర్ 31 వరకు రూ.7990 కోట్ల నష్టాన్ని వొడాఫోన్ ఐడియా చవిచూడాల్సి వచ్చింది. జియో, ఎయిర్ టెల్ నెట్ వర్క్స్ వొడాఫోన్ ఐడియాకు ప్రధాన పోటీదారులు అవడం.. జియో, ఎయిర్ టెల్ వైపే చాలామంది కస్టమర్లు మొగ్గుచూపడంతో వొడాఫోన్ కస్టమర్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. మళ్లీ కస్టమర్ల బేస్ ను పెంచుకోవడం కోసం త్వరలోనే 5జీ సర్వీసులను లాంచ్ చేయనున్నట్టు వొడాఫోన్ ఐడియా కంపెనీ ప్రకటించింది.