Whatsapp : వాట్సప్ ద్వారా మెసేజ్ లు పంపించుకోవచ్చు.. ఫోటోలు, వీడియోలు పంపించవచ్చు. వీడియో కాల్స్, ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. కానీ.. ఇలా వాట్సప్ వీడియో కాల్ ద్వారా ఒక మహిళలకు డెలివరీ కూడా చేయొచ్చని ఈ డాక్టర్లు నిరూపించారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ లో చోటు చేసుకుంది. వాట్సప్ వీడియో కాల్ ద్వారా ఒక మహిళకు విజయవంతంగా డాక్టర్లు డెలివరీ చేసి పండంటి బిడ్డకు ఆ మహిళ జన్మనిచ్చేలా చేశారు.
మెడికల్ ఎమర్జెన్సీలో టెక్నాలజీ ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుందో ఈ ఘటన ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ.. కెరన్ అనే జమ్ముకశ్మీర్ లోని ఓ రిమోట్ ప్రాంతంలో చిక్కుకుపోయింది. ఆమె ఉన్న ప్రాంతం నుంచి ఆసుపత్రికి తరలించం కష్టంగా మారింది. దానికి కారణం.. అక్కడ కురుస్తున్న భారీ మంచు. దాని వల్ల.. తనను హెలికాప్టర్ ద్వారా కూడా తరలించే ప్రయత్నాలు చేయలేకపోయారు అధికారులు.
Whatsapp : దీంతో టెక్నాలజీని నమ్ముకున్న డాక్టర్లు
దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో డాక్టర్లు టెక్నాలజీని నమ్ముకున్నారు. కెరన్ పీహెచ్‌సీలో ఉన్న ఆ మహిళకు మెడికల్ ఆఫీసర్ షఫీ.. వాట్సప్ కాల్ ద్వారా డెలివరీ చేశారు. తనకు పురిటి నొప్పులు ఎక్కువ అవడం, డెలివరీకి పలు సమస్యలు తలెత్తడంతో వెంటనే పీహెచ్‌సీ డాక్టర్ల సెల్ కు వాట్సప్ కాల్ చేసి.. డాక్టర్ చెప్పినట్టుగా అక్కడి డాక్టర్లు ఆ మహిళకు డెలివరీ చేశారు. దీంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత తల్లీకూతుళ్లకు ఎలాంటి ప్రమాదం లేదని.. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో టెక్నాలజీని నమ్ముకోవాల్సి వచ్చిందని.. టెక్నాలజీ లేకుంటే ఆ మహిళ పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. కొన్ని విషయాల్లో టెక్నాలజీ మనకు మంచే చేస్తుంది. కానీ.. దాన్ని చెడు కోసం వినియోగించుకుంటేనే లేనిపోని సమస్యలు.