WHATSAPP:వాట్స్ఆప్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. అసరమైన సమాచారం కంటే కూడా అనవసరపు సమాచారం ఎక్కువగా వాట్స్ ఆప్ గ్రూప్స్ ద్వారా సర్క్యూలేట్ అవుతుంది. అయితే ఈ తప్పుడు సమాచార ప్రవాహాన్ని అడ్డుకోవడానికి వాట్స్ ఆప్ ఎప్పటికి అప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తునే ఉంది.

అయితే ఇప్పుడు వాట్స్ ఆప్ నుండి వస్తున్నా కొత్త ఫీచర్ తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడానికి మరింత తోడ్పడుతుంది. వాట్స్ ఆప్ గ్రూప్ అడ్మిన్ కు ఎక్కువ పవర్స్ ఇవ్వడానికి వాట్స్ ఆప్ అధికారులు సిద్ధమయ్యారు.
ఇప్పటి వరకు వాట్స్ గ్రూప్స్ లో ఎవరు పంపిన మెసేజ్ ను వాళ్ళే డిలీట్ చేసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు వాట్స్ ఆప్ తెస్తున్న కొత్త ఫీచర్ తో గ్రూప్ అడ్మిన్ కూడా ఎవరు పంపిన మెసేజ్ ను అయినా డిలీట్ చేసే ఫెసిలిటీని ఇస్తుంది. అలాగే మెసేజ్ ను డిలీట్ చేసే సమయాన్ని 2 రోజులు 12 గంటలకు పెంచనుంది. గ్రూప్ అడ్మిన్ గ్రూప్ మెంబెర్ పంపిన మెసేజ్ ను డిలీట్ చేస్తే, గ్రూప్ ఈ మెసేజ్ ను అడ్మిన్ డిలీట్ చేశాడని చూపిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు బీటా వెర్షన్ లలో అందుబాటులో ఉంది. త్వరలో అందరికి ఈ ఫీచర్ రానుంది.
అలాగే తాజాగా మెసేజ్ లకు రియాక్షన్ ఫీచర్ ను ఇచ్చింది. ఇలాంటి ఫీచర్ టెలిగ్రామ్ లాంటి ఆప్ లలో ఎప్పటి నుండి ఉంది. అలాగే లార్జ్ సైజు ఫైల్స్ ను పంపే అవకాశాన్ని కూడా వాట్స్ ఆప్ ఇచ్చింది. మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చేస్తే రియాక్షన్ ఎమోజిలు వస్తాయి. ఈ ఎమోజీలను వాడి రియాక్షన్ తెలుపవచ్చు. స్యాడ్, స్మైల్,లైక్, హార్ట్, సర్పైజ్, థాంక్స్ ఎమోజీలు రియాక్షన్ గా వస్తున్నాయి.