Whatsapp : వాట్సప్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్సప్ వాడుతుంటారు. ఏవైనా ఫోటోలు, వీడియోలు పంపించాలన్నా ఖచ్చితంగా వాట్సప్ ఉండాల్సిందే. ఆడియో, వీడియో కాల్స్ కు చాలామంది ఉపయోగించేది వాట్సప్ నే. ప్రపంచవ్యాప్తంగా వాట్సప్ కు కొన్ని వందల కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అందుకే వాట్సప్ ఫీచర్లను ఎప్పటికప్పుడు మార్చుతూ వస్తుంది కంపెనీ. వాట్సప్ ఫేస్ బుక్ కు చెందిన కంపెనీ అని తెలుసు కదా. మెటా కంపెనీ వాట్సప్ ను మెయిన్ టెన్ చేస్తోంది.
అందుకే త్వరలో ఫేస్ బుక్, వాట్సప్ రెండింటినీ ఇంటిగ్రేట్ చేసేందుకు మెటా సమాయత్తమవుతోంది. ప్రస్తుతం స్టాటస్ పెట్టడం అనేది కామన్ అయిపోయింది కదా. వాట్సప్ లో స్టాటస్ కు చాలా పాపులారిటీ ఉంది. అదే ఫేస్ బుక్ లో చూస్తే ఫేస్ బుక్ స్టోరీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్ స్టాలోనూ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్టోరీస్ ను ఇంటిగ్రేట్ చేసేందుకు మెటా ప్లాన్ చేస్తోంది.
Whatsapp : వాట్సప్ లో షేర్ చేస్తే చాలు.. ఫేస్ బుక్ లోనూ షేర్ అవుతుంది
తాజాగా వాట్సప్, ఫేస్ బుక్ ను ఇంటిగ్రేట్ చేసేలా ప్లాన్ చేస్తోంది మెటా. అంటే.. వాట్సప్ లో ఏదైనా స్టాటస్ షేర్ చేస్తే.. అది డైరెక్ట్ గా ఫేస్ బుక్ స్టోరీగానూ పోస్ట్ అవుతుంది. వాట్సప్ నుంచే ఫేస్ బుక్ స్టోరీని కూడా పోస్ట్ చేయొచ్చన్నమాట. దానికి సంబంధించిన డెవలప్ మెంట్ పై ప్రస్తుతం వాట్సప్ దృష్టి పెట్టింది. త్వరలోనే ఆ అప్ డేట్ వాట్సప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
అయితే.. ఇది ఆప్షనల్ ఫీచర్ గా రానుంది. ఈ ఫీచర్ ను డీఫాల్ట్ గా డిసేబుల్ చేసుకోవచ్చు. కావాలంటే ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటేనే ఆ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఎనేబుల్ చేసుకున్న తర్వాత వాట్సప్ లో షేర్ చేస్తే చాలు.. అది ఫేస్ బుక్ లోనూ డైరెక్ట్ గా షేర్ అవుతుంది.