whatsapp new update on group video calling feature
whatsapp new update on group video calling feature

Whatsapp : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి పరిచయం ఇది. వాట్సప్ వాడని వాళ్లు లేరు. ఇదివరకు అంటే.. ఎవరికైనా మెసేజ్ చేయాలంటే రూపాయి కట్ అయ్యేది. అది కూడా టెక్స్ట్ మెసేజ్. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే మెసేజ్ చేసేవాళ్లం. కానీ.. నేడు ఇంటర్నెట్ డేటా ఉంటే చాలు.. వాట్సప్ లో మెసేజ్ లు పంపించుకోవచ్చు. వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీడియో కాల్ చేసుకోవచ్చు. ఏదైనా డాక్యుమెంట్లు పంపించుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు, గ్రూప్ వీడియో కాలింగ్ ఆప్షన్ ఇలా చాలా ఆప్షన్లు వాట్సప్ లో ఉన్నాయి.

whatsapp new update on group video calling feature
whatsapp new update on group video calling feature

అందుకే.. వాట్సప్ కు ప్రస్తుతం అంత ఆదరణ లభిస్తోంది. ఇండియాలో ఎక్కువగా డౌన్ లోడ్ అయిన యాప్స్ లో వాట్సప్ టాప్ లో ఉంది. అందుకే.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్స్ ను అందిస్తూనే ఉన్నది. తాజాగా.. మరో అప్ డేట్ తో వాట్సప్ మన ముందుకు వచ్చింది. వీడియో కాలింగ్ లో కొత్త ఫీచర్ ను యాడ్ చేసింది.

Whatsapp : గ్రూప్ వీడియో కాలింగ్ లో Tap to Join option

సాధారణంగా ఏదైనా వీడియో కాల్ వచ్చినప్పుడు.. దాన్ని చూసుకోకపోతే అది మిస్డ్ వీడియో కాల్ గా పడుతుంది. గ్రూప్ వీడియో కాల్ వచ్చినప్పుడు కూడా అంతే. అయితే.. ఒక్కసారి గ్రూప్ వీడియో కాల్ ఆప్షన్ ను మిస్ అయితే.. మళ్లీ అందులో జాయిన్ అయ్యే అవకాశం ఉండదు. దీంతో గ్రూప్ వీడియో కాల్ మిస్ అయ్యామని చాలామంది బాధపడుతుంటారు.

whatsapp new update on group video calling feature
whatsapp new update on group video calling feature

కానీ.. ఇప్పటి నుంచి అలా మిస్ అయ్యామని బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ గ్రూప్ వీడియో కాలింగ్ ను మిస్ అయినా.. ఆ గ్రూప్ వీడియో కాల్ పూర్తయ్యేలోపు.. ఎప్పుడైనా మధ్యలో ఆ వీడియో కాల్ లో చేరే అవకాశం ఉంటుంది. దాని కోసం call section లోకి వెళ్లి.. Tap to Join అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. దీంతో ఆ గ్రూప్ వీడియో కాలింగ్ లోకి చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్ iOS బీటీ వర్షన్ ఓఎస్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ ఫేజ్ లో ఉంది. ఇది సక్సెస్ అయితే.. అందరు ఐవోఓస్ యూజర్లకు దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఓఎస్ లోనూ ఈ అప్ డేట్ ను తీసుకురానున్నట్టు వాట్సప్ ప్రకటించింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 15, 2021 at 9:17 ఉద.