IPHONE: ఈ నెల ప్రారంభంలో ఆపిల్ ఐఫోన్ 14 ప్రోతో పాటు ఐఫోన్ 14 ను విడుదల చేసింది. ఐఫోన్ 14 ప్రో మాత్రం కొత్త చిప్ సెట్ అండ్ డైనమిక్ ఐలాండ్ తో వచ్చింది. అయితే ఐఫోన్ 14 మాత్రం సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ వస్తున్నాయి . ఎందుకంటే ఐఫోన్ 14 సేమ్ ఐఫోన్ 13 లా ఉందని మీమ్స్ వస్తున్నాయి. అది నిజం కూడానూ. ఐఫోన్ 14 ను ఐఫోన్ 13ఎస్ లా రిలీజ్ చేసినా బాగుండేదని చాలామంది టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే సేమ్ ఐఫోన్ 13లా ఉంది కాబట్టి ఐఫోన్ 14 వేస్ట్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇందులో కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయ్. కొంచెం పాత ఐఫోన్ వాడుతున్నవారికి, ఆండ్రాయిడ్ యూసర్స్ కి ఐఫోన్ 14 ఒక మంచి ఒప్షన్.
ధర:
భారతదేశంలో ఐఫోన్ 14 బేస్ 128GB మోడల్ రూ.79,990 ప్రారంభ ధరతో ప్రారంభించబడింది. మరో రెండు వేరియంట్‌లు ఉన్నాయి — 256GB రూ. 89,900 మరియు 512GB రూ. 1,09,900. కానీ లాంచ్ ఆఫర్‌లో భాగంగా, Apple HDFC క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే రూ. 6,000 వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.
ఐఫోన్ 14 ఫీచర్స్:
———————-
1. iOS 16 ఆపరేటింగ్ సిస్టమ్
2. Apple A15 బయోనిక్ చిప్
3. 128 GB ఇంటర్నల్ మెమరీ
4. 6.1-అంగుళాల OLED డిస్ప్లే
5. డ్యూయల్ 12MP ప్రైమరీ కెమెరా
6. 12 MP ఫ్రంట్ కెమెరా
7. అత్యవసర SOS
8. క్రాష్ డిటెక్షన్
9. 1 సంవత్సరం తయారీదారు వారంటీ
iPhone 14 బ్యాటరీ జీవితం: ఐఫోన్ లో మొదటి నుండి కూడా బాటరీ విషయంలో కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయ్. కానీ ఐఫోన్ వాటిని పట్టించుకోవడం లేదు. అయితే ఐఫోన్ 13 తో పోలిస్తే మాత్రం 14 యొక్క బ్యాటరీ పనితీరు చాలా మెరుగైంది.
ప్రశ్న ఏమిటంటే – వాస్తవానికి iPhone 14ని ఎవరు కొనుగోలు చేయాలి?
iPhone 14 ఇప్పటికే iPhone 13ని ఉన్నవాళ్ళు తీసుకోరనే విషయం Appleకి తెలుసు. ఇప్పటికీ కొన్ని పాత iPhone మోడల్స్‌ని ఉపయోగిస్తున్న వ్యక్తులు, iPhone 11 లేదా iPhone XR, ఖచ్చితంగా iPhone 14 కోసం వెళ్లొచ్చు. అలాగే ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఈ లేటెస్ట్ ఐఫోన్ కు షిఫ్ట్ అవ్వొచ్చు. ఐఫోన్ 13 మాత్రం ఇప్పుడు తక్కువ పరిచే కు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే లేటెస్ట్ ఐఫోన్ వచ్చినప్పుడు పాత వాటికి ధర తగ్గడం సహజం.