win free trip to space as an astronaut with virgin galactic
win free trip to space as an astronaut with virgin galactic

Free Trip to Space : అంతరిక్షంలోకి వెళ్లాలనేది అందరి కల. కానీ.. ఆ కల కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే.. అంతరిక్షంలోకి వెళ్లడం అనేది అంత ఈజీ కాదు. అది కేవలం ఆస్ట్రోనాట్స్ కే సాధ్యం. వాళ్లకే అంతరిక్షంలోకి వెళ్లే పర్మిషన్ ఉంటుంది. కానీ.. ఇప్పుడు ఎవ్వరైనా సరే.. అంతరిక్షంలోకి వెళ్లొచ్చు. అటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది వర్జిన్ గెలాక్టిక్ అనే కంపెనీ. ఇది స్పేస్ ఫ్లయిట్స్ కలిగిన కంపెనీ. స్పేస్ లోకి ఆస్ట్రోనాట్స్ నే కాదు.. సాధారణ పౌరులను కూడా తీసుకెళ్తే ఎలా ఉంటుంది.. అనే ఆలోచన నుంచి వచ్చిందే ఈ కాన్సెప్ట్.

win free trip to space as an astronaut with virgin galactic
win free trip to space as an astronaut with virgin galactic

వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ చీఫ్ రిచర్డ్ తో.. తెలుగు యువతి శిరీష్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆమెకు అనుకోకుండా.. అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం వచ్చింది. అలా అందరికీ రాదు. అందులోనూ స్పేస్ లోకి వెళ్లాలంటే అది మామూలు విషయం కాదు. కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అంత ఖర్చు భరించి స్పేస్ లోకి వెళ్లాలంటే కోటీశ్వరుడై ఉండాలి. మిడిల్ క్లాస్, పేద ప్రజలు అసలు.. స్పేస్ లోకి వెళ్లే ఆలోచన కూడా చేయలేరు. అయితే.. స్పేస్ లోకి ఉచితంగా సాధారణ పౌరులను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ.

Free Trip to Space : కేవలం ఇద్దరికే స్పేస్ లోకి వెళ్లే అవకాశం

అయితే.. ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నవాళ్లు అయినా సరే.. స్పేస్ లోకి వెళ్లేందుకు అప్లయి చేసుకోవచ్చు. కాకపోతే.. కేవలం ఇద్దరికి మాత్రమే ఆ చాన్స్. స్పేస్ కు వెళ్లాలనుకునే వాళ్లు.. omaze.com అనే వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత.. ఎంతో కొంత విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. Support space for humanity and enter for your chance to win అనే ఆప్షన్ ను క్లిక్ చేసి మీకు నచ్చినంత విరాళం ఇవ్వొచ్చు. అది ఆప్షనల్ మాత్రమే. విరాళం ఖచ్చితంగా ఇవ్వాలనే రూల్ లేదు. ఆ తర్వాత మీ వివరాలన్నీ అక్కడ పొందుపరచాల్సి ఉంటుంది.

ఇప్పటికే దీని కోసం రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ 1, 2021 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29న ఎవరు విన్ అయ్యారో ప్రకటిస్తారు. గెలిచిన వ్యక్తి.. తనతో పాటు.. మరో వ్యక్తిన స్పేస్ కు తీసుకెళ్లొచ్చు. 2022 లో వాళ్లకు స్పేస్ కు వెళ్లే అవకాశం లభిస్తుంది. అయితే.. ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే.. కనీసం 18 ఏళ్ల వయసు దాటాలి. గెలిచిన వాళ్లకు రెండు సీట్లను వర్జిన్ గెలాక్టిక్ కంపెనీకి చెందిన స్పేస్ షిప్ టూ ప్లేన్ లో సీట్లు కేటాయిస్తారు. స్పేస్ లోకి వెళ్లేముందు.. వాళ్లకు సబ్ ఆర్బిటల్ ఫ్లయిట్ శిక్షణను అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వెంటనే అప్లయి చేసుకోండి. స్పేస్ లోకి వెళ్లే ఆ చాన్స్ మీకే దక్కుతుందేమో.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 16, 2021 at 8:47 సా.