Wipro : సాధారణంగా ఉద్యోగాల నుంచి తీసేసినప్పుడు వాళ్లకు రెండు మూడు నెలల జీతాలను ఇచ్చి మళ్లీ వేరే ఉద్యోగం వచ్చే వరకు ఆ డబ్బులు వినియోగించుకుంటారనే ఉద్దేశంతో ఉద్యోగంలో నుంచి తీసేసిన తర్వాత సెవరెన్స్ పే లా కొన్ని బెనిఫిట్స్ కల్పిస్తుంటారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు చేసింది అదే. 60 రోజుల నోటీస్ పీరియడ్, ఇతర బెనిఫిట్స్ ను అందించి కొన్ని వేల మంది ఉద్యోగులను ఈ కంపెనీలు ఒకే రోజులో పీకేశాయి.
తాజాగా వీళ్ల బాటలోనే ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ విప్రో కూడా నడుస్తోంది. కాకపోతే వేలల్లో కాకుండా.. వందల్లో కొందరు ఉద్యోగులను విప్రో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 452 మంది ఉద్యోగులను విప్రో తొలగించింది. అయితే.. వీళ్లంతా ఫ్రెషర్స్. ఇటీవలే వీళ్లను క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారా ఉద్యోగంలోకి తీసుకొని ట్రెయినింగ్ ఇచ్చింది విప్రో. గత సంవత్సరం ప్రెషర్స్ గా తీసుకున్న వాళ్లకు ట్రెయినింగ్ ఇచ్చిన తర్వాత ఇంటర్నల్ టెస్ట్ నిర్వహించారు. కానీ.. ఇంటర్నల్ టెస్ట్ లో ఫెయిల్ అయిన ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించి.. ట్రెయినింగ్ కాస్ట్ రూ.75000 కట్టాలని విప్రో ఉద్యోగులకు పంపించిన మెయిల్ లో తెలిపిందట. కానీ.. ట్రెయినింగ్ కాస్ట్ ను రద్దు చేస్తున్నాం. మీరు తక్షణమే కంపెనీ వదిలి వెళ్లిపోవాలంటూ కంపెనీ మెయిల్ లో స్పష్టం చేసిందట.
Wipro : టెక్ ఇండస్ట్రీకి గడ్డుకాలమేనా ఇక
కరోనా సమయంలో ఎక్కువగా ప్రాఫిట్స్ చేసింది టెక్ ఇండస్ట్రీనే. కానీ.. కరోనా ఎఫెక్ట్ రెండేళ్ల తర్వాత దిగ్గజ ఇండస్ట్రీ ఐటీ మీద పడింది. దీంతో పెద్ద పెద్ద కంపెనీలే తట్టుకోలేక ఉద్యోగులను తొలగిస్తున్నాయి. నిజానికి.. 800 మంది ఉద్యోగులను తొలగించాలని విప్రో అనుకుందట. కానీ.. పూర్ పర్ ఫార్మెన్స్ పేరుతో 452 మందిని మాత్రమే ప్రస్తుతానికి తొలగించింది. వాళ్లంతా ఫ్రెషర్సే కావడంతో సీనియర్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. భవిష్యత్తులో పర్ ఫార్మెన్స్ పేరుతో సీనియర్ ఉద్యోగులకు కూడా ఉద్వాసన పలికినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఐటీ ఇండస్ట్రీలో మాస్ లేఆఫ్స్ ను ట్విట్టర్ ప్రారంభించింది. ఒకేసారి 50 శాతం మంది ఉద్యోగులకు తీసేసి సంచలనం సృష్టించింది ట్విట్టర్. ఆ తర్వాత ట్విట్టర్ ను ఫాలో అయి పలు ఇతర కంపెనీలు కూడా తమ కంపెనీ బర్డెన్ ను తగ్గించుకున్నాయి. తాజాగా విప్రో కూడా ఆ జాబితాలో చేరిపోయింది.