YouTube Search Tricks with Simple Commands
YouTube Search Tricks with Simple Commands

Youtube Search Tricks : మీకు తెలుసా? ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ యూట్యూబ్. మొదటిది ఏదో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రపంచంలోనే అతి పెద్ద సెర్చ్ ఇంజిన్. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వాళ్లు అయినా… ఇంటర్నెట్ వాడే వాళ్లు అయినా.. ఎవ్వరైనా ఏదైనా ఇంటర్నెట్ లో సమాచారం కావాలంటే ముందు కొట్టేది గూగులే. గూగుల్ అంటే చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందిందో… యూట్యూబ్ కూడా అంతే. యూట్యూబ్ గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లలకు ఇంకా యూట్యూబ్ ఎక్కువ పరిచయం. స్మార్ట్ ఫోన్ ను వాళ్ల చేతుల్లో పెడితే… ముందు వాళ్లు ఓపెన్ చేసేది యూట్యూబే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి సుపరిచితం. యూట్యూబ్ లో దొరకని వీడియో ఉండదు. వినోదం కావాలన్నా… సినిమా కావాలన్నా.. ఏదైనా సమాచారం కావాలన్నా… ఇంకా ఏదైనా కావాలన్నా.. యూట్యూబ్ లో వీడియోలు కోకొల్లలు. మనిషి తన జీవితం మొత్తం కూర్చొని చూసినా కూడా యూట్యూబ్ లోని వీడియోలు అయిపోవు. అన్ని కోట్ల వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో.

YouTube Search Tricks with Simple Commands
YouTube Search Tricks with Simple Commands

అయితే.. చాలామందికి కావాల్సిన వీడియోను యూట్యూబ్ లో సెర్చ్ చేయడం తెలియదు. యూట్యూబ్ కీవర్డ్స్ ను బేస్ చేసుకొని వీడియోలను యూజర్లకు అందిస్తుంది. కరెక్ట్ కీవర్డ్ ఇస్తేనే కావాల్సిన వీడియోను అందిస్తుంది. లేదంటే… యూజర్ కు కావాల్సిన వీడియోను చూపించదు యూట్యూబ్. అందుకే.. యూట్యూబ్ వాడేవాళ్లు సరైన కీవర్డ్స్ ఇవ్వడం తెలుసుకోవాలి. యూట్యూబ్ లో ఏ వీడియో కావాలన్నా క్షణాల్లో చూడాలంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ ను ఫాలో అయితే చాలు.

Youtube Search Tricks : కీవర్డ్స్ ఎలా ఇవ్వాలో తెలుసుకుంటే చాలు…

మీరు ఏదైనా ఒక యూట్యూబ్ చానెల్ ను వెతకాలి అని అనుకుంటే… ఆ యూట్యూబ్ చానెల్ పేరు ఒక్కటి సెర్చ్ చేస్తే యూట్యూబ్ చానెల్ ను యూట్యూబ్ చూపించకపోవచ్చు. ఎందుకంటే… ఆ యూట్యూబ్ చానెల్ పేరుతో కూడా వేరే వీడియోలు ఉండొచ్చు. అందువల్ల… ఏదైనా యూట్యూబ్ చానెల్ ను చూడాలనుకుంటే.. సెర్చ్ లో చానెల్ పేరుతో పాటు కామా ఇచ్చి చానెల్ అని ఇవ్వాలి. ఉదాహరణకు telugu online news, channel. ఇక్కడ telugu online news అనేది చానెల్ పేరు. దాని తర్వాత కామా ఇచ్చి channel అని ఇవ్వాలి. అప్పుడు మీరు వెతుకున్న చానెల్ ను ఫస్ట్ పేజీలోనే చూపిస్తుంది యూట్యూబ్.

ఏదైనా లైవ్ వీడియో చూడాలనుకుంటే… ఊరికే ఏదో ఒక కీవర్డ్ కొడితే లైవ్ వీడియో రాదు. సెర్చ్ క్వెరీలో లైవ్ అనే కీవర్డ్ ను కూడా ఇవ్వాలి. ఉదాహరణకు telugu online news, live అని ఇస్తే… telugu online news కి సంబంధించిన లైవ్ వీడియోలను యూట్యూబ్ చూపిస్తుంది.

YouTube Search Tricks with Simple Commands
YouTube Search Tricks with Simple Commands

మీకు యూట్యూబ్ లో ఈరోజు అప్ లోడ్ చేసిన వీడియోలే కావాలనుకుంటే… లేదా ఈ వారం అప్ లోడ్ చేసిన పర్టిక్యులర్ వీడియోలు కావాలనుకుంటే…. సెర్చ్ క్వెరీతో పాటు… today లేదా this week అనే కీవర్డ్ ను ఇవ్వాలి. ఉదాహరణకు telugu online news, this week అని ఇస్తే… telugu online news కి సంబంధించిన ఈ వారం వీడియోలు మాత్రమే వస్తాయి. ఈ వారం అప్ లోడ్ అయిన వీడియోలనే యూట్యూబ్ చూపిస్తుంది.

మీకు ఏదైనా అఫీషియల్ సమాచారం కావాలంటే… వేరే డూప్లికేట్ కానీ… ఇతర కాపీ చేసిన సమాచారం వద్దు అనుకుంటే… అప్పుడు మీరు మీ సెర్చ్ క్వెరీతో పాటు partner అని జతచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు జస్టిన్ బీబర్ పాడిన ఏదైనా ఒరిజినల్ ట్రాక్ కావాలనుకుంటే… దానికి సంబంధించిన వేరే పారడీలు ఏవీ వద్దు అనుకుంటే.. ఫ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు కూడా వద్దు అనుకుంటే.. అప్పుడు మీరు జస్టిన్ బీబర్ పాడిన పాట never say never, partner అని యూట్యూబ్ లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది.

మీకు యూట్యూబ్ లో ఏదైనా సినిమా చూడాలనిపిస్తే… ఆ సినిమా పేరు కానీ లేదా సినిమా హీరో పేరు కానీ సెర్చ్ చేసి దానికి movie అనే కీవర్డ్ ఇవ్వాలి. ఉదాహరణకు chiranjeevi, movie అని ఇస్తే.. చిరంజీవికి సంబంధించిన ఫుల్ లెన్త్ సినిమాలన్నీ యూట్యూబ్ లో వస్తాయి.

ఒకవేళ మీకు HD లేదా 4K వీడియోలు మాత్రమే కావాలనుకుంటే… మీకు కావాలనుకున్న వీడియో సెర్చ్ క్వెరీతో పాటు hd లేదా 4k అని ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు bahubali movie, hd లేదా bahubali movie, 4k.

YouTube Search Tricks with Simple Commands
YouTube Search Tricks with Simple Commands

మీకు 3D వీడియోలు మాత్రమే కావాలనుకుంటే… సెర్చ్ క్వెరీ తర్వాత 3d అని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు robo 2.0, 3d అని టైప్ చేస్తే రోబో 2.0 సినిమా 3డీ వర్షన్ వీడియో వస్తుంది. కాకపోతే… 3డీ వీడియోలు చూడాలంటే మీ దగ్గర 3డీ గ్లాసెస్ ఉండాలి.

మీకు ఏదైనా వీడియో ప్లేలిస్ట్ కావాలనుకుంటే… సెర్చ్ క్వెరీతో పాటు playlist అనే ఆప్షన్ ను కూడా ఇవ్వలి. మీకు ఎక్కువ లెన్త్ ఉన్న వీడియోలు కావాలనుకుంటే…. మీ సెర్చ్ క్వెరీతో పాటు long అనే ఆప్షన్ ను ఇవ్వాలి. అలా ఇస్తే… కనీసం 20 నిమిషాల డ్యురేషన్ ఉన్న వీడియోలను మాత్రమే యూట్యూబ్ చూపిస్తుంది. ఉదాహరణకు telugu comedy videos, long అని కొడితే తెలుగు కామెడీ వీడియోలు వస్తాయి. అవి కూడా 20 నిమిషాల కంటే ఎక్కువ ఉన్న వీడియోలు వస్తాయి. ఒకవేళ short అని ఇస్తే… 4 నిమిషాల వరకు ఉన్న వీడియోలను యూట్యూబ్ చూపిస్తుంది.

మీకు ఏ వీడియో కావాలన్నా…. దానికి సంబంధించిన కీవర్డ్స్ ను కామా సపరేట్ చేస్తూ ఇవ్వడమే. అలా ఎన్ని ఎక్కువ కీవర్డ్స్ ను ఇస్తే… అంత పర్ ఫెక్ట్ మ్యాచ్ వీడియోలు వస్తాయి. ఉదాహరణకు తెలుగు మోటివేషన్ వీడియోలు ఈరోజు అప్ లోడ్ అయినవి, అవి కూడా ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు hd కావాలనుకుంటే… telugu motivational videos, hd, today, long అని ఇవ్వాల్సి ఉంటుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 19, 2021 at 1:20 సా.