Anchor Lasya: యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈమె గురించి తెలియని వారు ఉండరు. ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ తో బాగా పాపులర్ అయింది. అందులో చీమా, ఏనుగు జోక్స్ తో అందరినీ నవ్వించింది. యాంకర్ గా బుల్లితెర లో ఎన్నో షోలలో వేదికలో ఆమె అల్లరి చేస్తూ కనిపించేది.
అలాగే ఒకప్పుడు ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ల కు కూడా యాంకరింగ్ చేసేది. అయితే పెళ్లి చేసుకొని కొంతకాలం ఆమె బుల్లితెరకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్లో తమ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. వీడియోల ద్వారా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా లాస్య హాస్పిటల్ కు పాలైనట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని స్వయంగా లాస్య భర్త మంజునాథ్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులకు చెప్పుకున్నారు. అలాగే దీనికి సంబంధించి ఒక పోస్టును షేర్ చేశారు. ఆ పోస్ట్ కు గెట్ వెల్ సూన్ అంటూ క్యాప్షన్ పెట్టారు.
దీంతో యాంకర్ లాస్యకు ఏమైందంటూ ఆమె ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. లాస్య హాస్పిటల్ లో ఎందుకు ఉంది ?ఆమెకు ఏమైంది? అన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. అలాగే ఆమె త్వరగా కోలుకోవాలని కోలుకొని మళ్ళీ ఎప్పటిలా ఉండాలని కోరుకుంటూ తదుపరి నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బుల్లితెర సెలెబ్రెటీలు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నట్టు వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పోస్టులను కామెంట్లను చేస్తున్నారు.
Anchor Lasya: లాస్య అనారోగ్యం గురించి ఆందోళన చెందుతున్న తన ఫ్యాన్స్..
అయితే లాస్య అనారోగ్యం బాగోలేదా..? ఆమె కు ఏమైంది..? అంటూ జనాలు తెగ ప్రశ్నలు అడిగేస్తున్నారు. అయితే ఇంత వరకు దీనిపై లాస్య భర్త మంజునాథ్ ఇంకా స్పందించలేదు. అయితే లాస్య కు ఏమైదన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయాన్ని త్వరగా కోలుకొని లాస్య మళ్లీ సోషల్ మీడియాలో వచ్చాకే తెలుస్తుందని చెప్పాలి.