Bala Krishna: నటసార్వభౌమ నందమూరి బాలకృష్ణ గురించి పరిచయం కొత్తగా అవసరం లేదు. బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. 100 కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు ఆయన ప్రముఖ రాజకీయ నేత కూడా.
ఇక ఇటు సినిమాలు, అటు రాజకీయాల్లో బాలయ్య ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. తన నటనతో ఎన్టీఆర్ కు తగ్గ కొడుకుగా బాలకృష్ణ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు బాలయ్య. అయితే బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వహించారు.
ఈ సినిమాలో బాలకృష్ణ టబు, శ్రియలు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రిగా కొడుకుగా రెండు పాత్రలు చేశాడు. ఈ సినిమా రికార్డులను తిరిగి రాసింది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ నటనకు అందులో ఉన్న భారీ సీన్లకు చాలా గుర్తింపు వచ్చింది అప్పట్లో ఈ సినిమాలు దాదాపు లక్షల్లో వసూళ్లు చేసింది.
ముఖ్యంగా సుమోలు లేపడం మాత్రం హైలెట్ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పాలి.
ఇప్పటికే చెన్నకేశవరెడ్డి సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా చెన్నకేశవరెడ్డి సినిమాను మళ్ళీ విడుదల చేయనున్నారు బెల్లంకొండ సురేష్.
Bala Krishna: 400 లకు పైగా స్క్రీన్ లలో చెన్నకేశవ రెడ్డి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 400 లకు పైగా స్క్రీన్స్ లో విడుదల చెయ్యాలని అనుకుంటున్నాము, అని చెప్పాడు. ఈ సినిమాకి వస్తున్న డిమాండ్ చూసి నేనే షాక్ అయ్యా, ఒక్కో ఏరియా కి హక్కుల కోసం పెద్ద మొత్తం లో డబ్బులు ఇస్తాము అని ఒకరితో ఒకరు పోటీ పడి మరీ వస్తున్నారు, అందుకే నేనే నేరుగా విడుదల చెయ్యాలని అనుకున్నా, అని చెప్పాడు.