Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి పరిచయం కొత్తగా అవసరం లేదు. బాలకృష్ణ అంటే తెలియని వారు ఉండరు. 100 కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఆహా ఓటీటీ లో వచ్చిన అన్ స్టాపబుల్ కు హోస్ట్ గా చేశారు.
ఇక ఆయన ప్రముఖ రాజకీయనేత కూడా. ఇటు సినిమాలు, అటు రాజకీయాల్లో బాలయ్య ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు బాలయ్య గురించి కొన్ని సంచలన వ్యాఖ్యాలు చేశాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యాలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సెలబ్రెటీల జాతకాలపై కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు.
ఏ సెలబ్రెటీల జ్యోతిష్యం ఎలా ఉందో అన్నది ఏదో ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్తూనే ఉంటారు. ప్రభాస్, రష్మీక ల పెళ్లి గురించి కూడా గతంలో ఓ ఇంటర్వ్యూ లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అలాగే పూజ హెగ్డే వరుస ఫ్లాప్ ల గురించి కూడా ఆయన చెప్పాడు. ఆ తర్వాత తాజాగా విజయ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యాలు చేశాడు. అయితే వేణు స్వామి చెప్పే ప్రతి విషయాలు సెలబ్రెటీల జీవితంలో నిజం అయిన విషయం కూడా తెలిసిందే.
అయితే వారు చెప్పినట్టు అన్ని జరిగాయి. అయితే బాలకృష్ణ తనకు బాగా తెలుసని.. ఆయన ఎన్నో సినిమాల కు ఈయనే ముహూర్తాలు పెట్టారు అని చెప్పుకొచ్చాడు. అయితే బాలకృష్ణ అందరూ అనుకుంటున్నట్టు కాదని చాలా మంచి వాడు అని ఆయన తెలిపాడు.
Balakrishna: బాలయ్య గురించి అలా నిజాలు బయటపెట్టిన వేణు స్వామి..
బయట బాలయ్య గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవని.. ఆయన చాలా మంచి వారని అన్నాడు. ఎప్పుడు కలిసిన ఎంతో సన్నిహితంగా ఉంటాడని.. చిరునవ్వుతో మాట్లాడుతాడు అని చెప్పాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.