Brahmamudi February 3 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇక్కడి నుంచి వెళ్తావా సెక్యూరిటీని పిలవమంటావా అంటాడు రాజ్. వద్దు నేనే వెళ్తాను జీవితంలో ఇంకెప్పుడూ మీ ఇంటికి రాను అంటూ వెళ్ళిపోతుంది కావ్య. నడవలేకపోతున్న స్వప్న ని ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు రాజ్. బాధపడుతున్న కావ్యని ఓదారుస్తుంది అప్పు.

కావ్యని ఓదారుస్తున్న అప్పు..

వాళ్ల కోసం ఎంత చేసావు అవసరం ఉంటే ఒకలాగా అవసరం తీరాక మరొక లాగా మాట్లాడుతారు వాళ్ళు. మనోళ్లే కదా వదిలేద్దాం అంటుంది కావ్య. పోనీలే అక్కని వదిలేయి వాడెవడు నిన్ను అన్ని మాటలు అనటానికి అయినా వాడు అన్ని మాటలు అంటుంటే నువ్వెందుకు నోరు మూసుకొని వచ్చావు కదా వాడి సంగతి చూద్దాం అని అప్పు అంటే ఏంటి రౌడీ లాగా జరిగింది చాలదా ఇప్పటికే చాలా ఫీల్ అవుతున్నాను.

అక్క రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఊరుకున్నాను, ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయ్ అంటుంది కావ్య. నువ్వు కూడా వదిలేస్తే వాడికి పొగరు ఎవరు దించుతారు అంటుంది అప్పు. ఉన్నాడుగా నా వినాయకుడు అంటుంది కావ్య. సరే పోదాం పద అంటుంది అప్పు. నువ్వు వచ్చేస్తే వాళ్లని ఎవరు తీసుకొని వస్తారు వాళ్ళని కంట్రోల్ చేయగలిగేది నువ్వే అంటుంది కావ్య. ఇక్కడ డబ్బులు కంపబడుతుంది ఎలా ఉండేది అంటుంది అప్పు.

స్వప్న కి సేవలు చేస్తున్న రాజ్..

తప్పదు,వాళ్లని తీసుకొని రా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు స్వప్నని రాజ్ బెడ్ మీద పడుకోబెడతారు సర్వెంట్స్. ఇది రాజ్ బెడ్ రూమా?ఎంతోమంది కలలుకనే కలల రాకుమారుడు బెడ్ రూమ్లో నేను ఉన్నాను ఇది కళ నిజమా అని మురిసిపోతుంది స్వప్న. రాజ్ బయటే నిల్చున్నాడు ఏంటి లోపలికి రాడా ఎలాగ్రప్పించాలి అనుకుంటుంది స్వప్న. తన కాలికి కాపడం పెడుతుంటే గట్టిగా అరుస్తుంది స్వప్న.

కంగారుపడిన రాజ్ లోపలికి వచ్చి కాలు ట్విస్ట్ అయిందా? హాస్పిటల్ కి వెళ్దామా అని అడుగుతాడు. వద్దు అంటుంది స్వప్న. సర్వెంట్ ని అక్కడ్నుంచి వెళ్ళమని తనే కాలికి కాపడం పెడతాడు రాజ్. బయట మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది అంటుంది స్వప్న. ముద్దపప్పు మొహం దాన కాసేపు అక్కడే ఉంటే ఏం పోయింది అనుకుంటుంది కనకం. స్వప్నని నడిపించి బయటికి తీసుకురాబోతుంటే తూలిపోయినట్లుగా కావాలనే రాజ్ మీద పడుతుంది స్వప్న.

కూతుర్ని చూసి మురిసిపోతున్న కనకం..

నడవగలరా అని అడుగుతాడు రాజ్. ఈ రాకుమారుడిని చేసుకుంటే ఈ కోటకి నేనే మహారాణిని కదా అనుకుంటుంది స్వప్న. బయటికి మాత్రం కొంచెం కష్టమే అంటుంది స్వప్న. నేను అనుకున్నది తొందరలోనే సాధిస్తుందని నమ్మకం ఇప్పుడే కుదిరింది అనుకుంటుంది కనకం. మరోవైపు కావ్య ని వెతుక్కుంటూ వచ్చిన కళ్యాణ్ అప్పుని గుద్దేసి సారీ బ్రో అంటాడు. బ్రో ఏంటి బ్రో నీ కళ్ళు కాకులు ఎత్తుకెళ్లాయా అంటూ ఫైర్ అవుతుంది అప్పు.

అందులో తప్పేముంది బ్రో అంటూ మళ్ళీ బ్రో అంటాడు. ఇది తాగు గరం గరం గ ఉన్న నీ బుర్ర కూల్ అవుతది అంటది అప్పు. థాంక్స్ బ్రో అంటాడు కళ్యాణ్. మళ్లీ బ్రో అంటావ్ ఏంట్రా బాబు అంటూ ఇరిటేట్ అవుతుంది అప్పు. మరోవైపు స్వప్నకి సేవలు చేయటం చూసిన రేఖ వాళ్ళు రాజ్ ని ఆటపట్టిస్తారు. మీ పేరేంటి మీరు ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతుంది రాజ్ చెల్లెలు. నేను ఎక్స్క్లూజివ్ డిజైనర్ని అంటూ అబద్ధం చెప్పేస్తుంది స్వప్న.

నోటికి వచ్చిన అబద్ధం చెప్తున్న స్వప్న..

మీతో వచ్చిన టోపీ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది రేఖ. తను నా బాడీగార్డ్ అంటుంది స్వప్న. తను పెయిన్గా ఫీల్ అవుతుంటే ఏంటి ఈ ఇంటర్వ్యూ అంటూ విసుక్కుంటాడు రాజ్. మీరు నొప్పితో బాధపడుతున్నట్లుగా ఉన్నారు మీరు వద్దన్నా నేను డాక్టర్ కి ఫోన్ చేస్తాను అంటూ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు రాజ్. హాల్లోనే ఉన్న కనకాన్ని చూసి మీరు ఎవరు అని అడుగుతుంది రాజ్ వాళ్ల అమ్మ. ఇందాక డాన్స్ చేసింది కదా వాళ్ళ అమ్మని అంటూ పరిచయం చేసుకుంటుంది కనకం.

కూతురు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లి ఎలా ఉంది అని అడుగుతుంది కనకం. డాక్టర్ కి ఫోన్ చేశాను అని రాజ్ అంటే మళ్ళీ చెయ్యు అంటుంది వాళ్ళ అమ్మ. మీ ఇల్లు ఎక్కడ అని రాజ్ వాళ్ళ అమ్మ అడిగితే, జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు ఉంది బంజారాహిల్స్ లో ఒక ఇల్లు ఉంది అంటూ నోటుకి వచ్చిన అబద్ధం చెప్పేస్తుంది కనకం. రాజుని మళ్లీ కలవాలంటే చాలా కష్టం మళ్లీ కలవాలంటే ఇప్పుడే క్రియేట్ చేయాలి అంటూ తన ఇయర్ రింగ్స్ తీసి రాజ్ బెడ్ మీద పెట్టేస్తుంది.

ఈ అమ్మాయి గురించి ఆలోచించాలి అనుకుంటున్న రాహుల్..

దాని వంక పెట్టుకుని మళ్ళీ రావచ్చు అని ఆమె ఉద్దేశం. అప్పుడే వచ్చిన రాహుల్ బయట మీ ఇద్దరి గురించి మీడియా తెగ మాట్లాడుకుంటుంది రేపు ఇదే హాట్ టాపిక్ అవ్వచ్చు అంటాడు. ఆమెది మెస్మరైజ్ చేసే అందం అంటాడు రాజ్. అమ్మాయిని ఇష్టపడుతున్నాడన్నమాట మనం కూడా ఈ అమ్మాయి గురించి ఆలోచించాలి అనుకుంటాడు రాహుల్. మరోవైపు తండ్రిని భోజనానికి పిలిస్తే మీ అమ్మ ఫోన్ చేసిందా అని అడుగుతాడు కృష్ణమూర్తి.

రాలేదు అని కావ్య చెప్తే అక్కడ ఎన్ని గొప్పలు చెప్తుందో ఏంటో అంటాడు కృష్ణమూర్తి. వాళ్ల సంగతి తెలిసిందే కదా నువ్వు భోజనం చెయ్యు అంటుంది వాళ్ళ వదిన. అక్కడ ఏం కొంపలో ముంచుతుందో అని నా భయం అంటాడు కృష్ణమూర్తి. నువ్వు మీ అమ్మ వాళ్ళని వదిలి ఎప్పుడూ రావు కదా ఎందుకు వాళ్ళని వదిలేసి వచ్చావు అని అడుగుతాడు కృష్ణమూర్తి. అప్పుని కనిపెట్టుకొని ఉండమన్నాను మీరు తినండి అంటుంది కావ్య.

తన నిర్ణయాన్ని తాత గారికి చెప్పిన రాజ్..

మరోవైపు ఆమెకి ఏమీ కాలేదు ఏమైనా జరిగి ఉంటే మనకి చెడ్డ పేరు వచ్చి ఉండేది అంటాడు రాజ్ తండ్రి. రాజ్ ఆ అమ్మాయిని రెండు చేతులతో ఎత్తుకొని రావటం మీడియా కవర్ చేసింది అంటాడు రాహుల్. అతనికి ఇసుమంతైన గర్వం లేదని సీతారామయ్యగారు మంచివారిని ఎంచుకున్నారని తెగ పొగిడేస్తున్నారు అంటాడు కళ్యాణ్. ఫంక్షన్ డిస్టర్బ్ కాకూడదని వేరే అమ్మాయి చేయవలసిన డాన్స్ ని తను చేసింది అంటాడు రాజ్ తండ్రి.

ఇంతమందిని మెప్పించినందుకు ఆ అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అంటాడు రాజ్. మంచిదే అంటాడు సీతారామయ్య. మరోవైపు తండ్రి కి టాబ్లెట్స్ ఇస్తున్న కానీ మీ అమ్మ వాళ్లు ఇంకా రాలేదేంటి ఎంత ఆకాశంలో మేడలు కట్టిన తిరిగి రావాల్సింది ఈ పెంకుటింటికే కదా అంటూ చికాకు పడతాడు కృష్ణమూర్తి. వాళ్లని చూసుకోవటానికి అప్పు ఉంది నువ్వు వెళ్లి పడుకో అంటుంది వాళ్ళ వదిన. అయినా వాళ్లు ఇంకా ఎందుకు రాలేదు, నువ్వు కూడా వాళ్లతోనే ఉండి ఉంటే నాకు నిశ్చింతగా ఉండేది అంటాడు కృష్ణమూర్తి.

టాపిక్ మార్చేసిన స్వప్న..

చిన్నప్పుడు నువ్వు బర్త్ డే పార్టీ కి తీసుకెళ్లినప్పుడు జరిగిన గాయం నాకు ఇప్పటికీ గుర్తు. నాకు అప్పుడే తెలిసింది డబ్బు ఉన్న వాళ్ళకి ఎంత అహంకారం ఉంటుందో అని. పెద్దమ్మకి ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా డబ్బున్న వాడే కదా ఇప్పుడు ఈ దుగ్గిరాల వాళ్లు కూడా అలాగే ఉన్నారు అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అంటుంది కావ్య. అలాంటప్పుడు వాళ్లు అక్కడ ఎలాగ ఉన్నారు ఏం కొంప ముంచుతున్నారు ఏంటో అంటూ బాధపడతాడు కృష్ణమూర్తి.

మరోవైపు డాక్టర్ స్వప్నని ట్రీట్ చేస్తూ ఉంటే మీరు ఎవరి తరపున వచ్చారు అని అడుగుతుంది రాజ్ వాళ్ళ పిన్ని. అదేంటి డబ్బున్న వాళ్లు డబ్బున్న వాళ్లనే పిలుస్తారు కానీ పూర్ వాళ్లని పిలుస్తారా ఏంటి అంటూ కోపం నటిస్తుంది కనకం. మా కోడలు ఉద్దేశం అది కాదు మీ కుటుంబంతో పరిచయం పెంచుకోవడం కోసం అడుగుతుంది అంటుంది చిట్టి. పరిస్థితిని అర్థం చేసుకున్న స్వప్న టాపిక్ మార్చడం కోసం ఇంగ్లీష్ లో డాక్టర్ తో ఏదో మాట్లాడుతుంది.

Brahmamudi February 3 Today Episodeచదువు వినయాన్ని ఇస్తుందంటున్న రాజ్ తల్లి..

మీ అమ్మాయిని బాగా చదివించినట్లు ఉన్నారు అంటే అవును గొప్ప కాలేజీలో చదువుతుంది అంటుంది కనకం. ఎంత ఆస్తి ఉన్నా వినయాన్ని ఇచ్చేది చదివే అంటుంది రాజ్ వాళ్ళ తల్లి. ఇప్పటికే మేడం వాళ్ళు మన వల్ల డిస్టర్బ్ అయ్యారు ఇంకా మనం వెళ్దాం అంటుంది స్వప్న. తరువాయి భాగంలో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని రాజ్ అంటే వద్దులేండి మేము వెళ్ళిపోతాము అంటుంది స్వప్న. వాళ్లు మనల్ని త్వరగా చేసేస్తారు రండి అంటూ ఎక్కుతారు కనకం వాళ్ళు. అది గమనించిన రుద్రాణి ఇకపై కథ నేను నడిపిస్తాను అనుకుంటుంది.