Business Idea: బిజినెస్ చేసి తక్కువ పెట్టుబడితో రాబడి పొందానాన్ని చాలామంది అనుకుంటూ ఉంటారు. తమ కుటుంబం కోసం ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడో దూరంగా వెళ్లడానికి డబ్బులు కూడా లేక పెద్ద బిజినెస్ లు చేయడానికి తగిన పెట్టుబడి లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఓ బిజినెస్ ఐడియా ఉంది. ఈ బిజినెస్ లో అతి తక్కువ పెట్టుబడి తో వేలకు రాబడి వస్తుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చళ్ల వ్యాపారం.. ఈ వ్యాపారంతో తక్కువ పెట్టుబడి పెట్టి నెలకి దాదాపు రూపాయలు 30 వేల వరకు సంపాదించుకోవచ్చు. అయితే ఇంట్లో చాలామంది అన్నంలో పచ్చడి లేనిదే అన్నం తినరు. అలాగే మన ఇంట్లో మాత్రమే కాదు దేశంలో చాలామంది ఇలాగే చేస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు పచ్చడిని ఇష్టపడతారు. రుచికరమైన పచ్చళ్ళు తయారు చేసే వాళ్ళు ఉంటే చాలు. అలాగే క్వాలిటీ గా తయారు చేయగలిగితే మీకు మంచి సంపాదన ఉంటుంది. మంచి రాబడి కూడా పొందవచ్చు.
పచ్చళ్ళ వ్యాపారంతో ఇంత లాభమా..?
దీనికి పెట్టుబడి కూడా పెద్దగా లక్షల్లో ఏమీ అవసరం ఉండదు. కేవలం 10 వెలు ఉంటే చాలు. పదివేలతో ఈ బిజినెస్ ని మొదలు పెట్టవచ్చు. ఆ తర్వాత నెలకు 25 వేల నుంచి 30 వేల దాకా రాబడి పొందవచ్చు. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీనికోసం ఆత్మనిర్బర్ భారత్ మిషన్ సహాయం చేస్తుంది. కానీ ఈ బిజినెస్ ప్రారంభించాలంటే దానికి 900 స్క్వేర్ ఫీట్ స్థలం కావాలి. ఆ స్థలం ఓపెన్ స్పేస్ ఉండాలి. పచ్చళ్ళు ఉంచడానికి వాటిని తయారు చేయడానికి ఆ స్పేస్ అవసరం పడుతుంది.
Business Idea:
అదే విధంగా ఎక్కువ కాలం పచ్చళ్ళు పాడైపోకుండా ఉండాలంటే చాలా శుభ్రత పాటించాల్సి ఉంటుంది. ఇక పోతే ఈ వ్యాపారం మొదలు పెట్టాలంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి బిజినెస్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది . అలాగే మీరు ఈ బిజినెస్ నుంచి ఇంకొంచెం రాబడి పొందాలి అనుకుంటే పచ్చళ్ళను చుట్టుపక్కల ఉండే షాపులకు సరఫరా చేసి మీ బిజినెస్ కు పెంచుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా వీటిని అమ్మవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా మీ వ్యాపారాన్ని విస్తరించుకొని మీకు కావాల్సినంత లాభం పొందవచ్చు.