Business Tips: కూటికోసం కోటి విద్యలు అన్న సామెత పెద్దలు ఊరికే చెప్పలేదు. ప్రజలు జీవిస్తున్నది ఏదో ఒక పని చేసుకుని డబ్బు సంపాదించి కడుపునిండా అన్నం తినడం కోసమే అని పెద్దలు ఎప్పుడో చెప్పినా ఒక మాట. మనం చిన్నతనంలో సరిగ్గా చదువుకోకపోతే గాడిద అని మనకు చదువు చెప్పే ఉపాధ్యాయులు తిట్టేవారు. అలా గాడిద అని తిట్టించుకున్న ఆ పిల్లలే ఇప్పుడు గాడిదలను పెంచి లక్షలు సంపాదిస్తున్నారంటే అలా తిట్టిన ఆ ఉపాధ్యాయులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గాడిదలను పెంచి లక్షల రూపాయలు సంపాదించడం ఏమిటి అనుకుంటున్నారా. సరికొత్త ఈ ఆలోచనతో ముందుకు వెళితే అధిక ఆదాయం వస్తుందని అంటున్నారు కొంతమంది యువకులు. గాడిద ఎక్కువగా బరువులు మోయడానికే ఉపయోగపడుతుంది. కానీ గాడిద పాలలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని పెద్దల ద్వారా విన్న ఒక యువకుడు చాలామంది వైద్య నిపుణులు కూడా సంప్రదించి గాడిదలను పెంచడం మొదలుపెట్టాడు.
Business Tips: గాడిదలతో లక్షల్లో వ్యాపారం..
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కిరణ్ అనే ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కొడుకుకి ఉబ్బసం అనారోగ్య సమస్యతో బాధపడుతుండేవాడు. ఆ సమస్యకు గాడిద పాలు తాగితే సమస్య తగ్గుతుందని చాలామంది సలహా ఇచ్చారు. అప్పుడు కిరణ్ గాడిద పాలను తన కొడుకుకి త్రాగించిన వెంటనే సమస్య నుండి ఉపశమనం కలిగింది. అప్పుడు గాడిద పాల ధర ఎక్కువగా ఉండడం చూసి గాడిదల్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నాడు.
అప్పుడు కిరణ్ గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లి గాడిదలను కొని తెచ్చాడు. మల్లంపూడిలో 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని గాడిదల ఫామ్ ను మొదలు పెట్టాడు. ఆ ఫామ్ లో చాలా జాతులకు చెందిన గాడిదలు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ లో వీటి పాల ధర 5 వేల నుంచి 7 వేల వరకు ఉంది. ఈ గాడిదల పాల పన్నీరు యూరోపియన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది అని అంటున్నారు. గాడిద పాలను సీసాలో పోసి డి ఫ్రిజ్ లో పెట్టి వారానికి ఒకసారి కంపెనీలకు సరఫరా చేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో గాడిద ధర 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంది.