Comedian Sunil: ప్రముఖ నటుడు సునీల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఎప్పటి నుంచో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎక్కువ హాస్యపాత్రల్లో నటించి తర్వాత కథానాయకుడిగా మారాడు. అందాల రాముడు అతనికి కథానాయకుడిగా మొదటి సినిమా. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న మంచి ప్రజాదరణ పొందింది.
ఇక రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు. త్రివిక్రమ్ సలహాతో హాస్యనటుడిగా ప్రయత్నించాడు. తన సినిమాల్లో కూడా అతనికి పాత్రలు ఇప్పించాడు. సునీల్ కేవలం నటుడు గానే కాకుండా హీరో గా కూడా మంచి పేరు ను తెచ్చుకున్నాడు. అయితే ఇతడు హాస్యనటుడు, నటుడు, హీరో, విలన్ గా అన్ని పాత్రల్లో తన నటనను అద్భుతంగా చూపించి తన సత్తా చాటుకున్నాడు.
ఏ పాత్రనైనా నటన అద్భుతంగా నటించడం సునీల్ కే సాధ్యం అని నిరూపించుకున్నాడు. అయితే
ప్రస్తుతం సునీల్ వరుసగా సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అయితే సునీల్ మిత్రుడు అయిన త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్ బాబు తో చెయ్యబోతున్న సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా లో కూడా సునీల్ చేయబోతున్నాడని తెలిసింది.
అయితే పుష్ప సినిమా తో సునీల్ కు తమిళ్ లో కూడా మంచి పేరు వచ్చింది. దీంతో అతడికి 4 తమిళ సినిమా ఆఫర్ లు వచ్చాయి. ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ లకు కూడా సునీల్ తిరుగుతున్నాడు అని సమాచారం. ఇక టాలీవుడ్ లో కూడా సునీల్ కు వరుస ఆఫర్ లు ఉన్నాయి. పుష్ప 2 లో కూడా సునీల్ ఉంటాడన్న విషయం తెలిసిందే.
Comedian Sunil: మునిపటి సునీల్ గా మారటానికి రానున్న సునీల్..
దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ తో చెయ్యబోతున్న సినిమా లో కూడా సునీల్ కు అవకాశం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరి హర వీరమల్లు సినిమా లో కూడా సునీల్ నటిస్తున్నాడు. అయితే సునీల్ అప్పటి అగ్ర హీరోలతో ఇప్పటి స్టార్ హీరోలతో కూడా నటిస్తూ దూసుకుపోతున్నాడు అనే చెప్పాలి. దీంతో సునీల్ మళ్ళీ కమెడియన్ గా మంచి ముద్ర వేసుకోనున్నట్లు తెలుస్తుంది.