అట్టర్ ప్లాప్ అయిన ఆచార్య.. దీనికి కారణం రాజమౌళినే అంటూ అభిమానులు ట్రోల్?

Akashavani

తెలుగు ప్రేక్షకులకు ఆచార్య సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే మొదలాయ్యాయి. ఇక ఈ సినిమాకు కొరటాల శివ ప్రాణం పోయగా ఆ అంచనాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.

కాగా ఈ సినిమా ఈరోజు అనగా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా చూసిన పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా బాగుంది అని కొందరు చెప్పగా.. మరికొందరు సినిమా బాగోలేదని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా కొందరు రాజమౌళి వల్లే ఆచార్య కు ఈ గతి వచ్చి నట్లు దెప్పి పొడుస్తున్నారు.

ఇంతకు అదెలా అంటే? రాజమౌళి తో హిట్ కొట్టిన హీరోలు ఆ తర్వాత సినిమాతో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక ఉదాహరణకు అప్పట్లో ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ అప్పట్లో ఈ సినిమా భారీ స్థాయిలో సక్సెస అయ్యింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన సుబ్బు సినిమా గోరంగా పరాజయం పాలైంది.

ఇక అదే రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా భారీ స్థాయిలో సక్సెస్ ను అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ఆంధ్రావాలా సినిమా ప్రేక్షకులు అంతగా మెప్పించలేకపోయింది. ఇక ప్రభాస్ దర్శక ధీరుడు జక్కన్న కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సిరీస్ ప్రపంచ స్థాయి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

Acharya: రాజమౌళిని కొందరు ఈ విధంగా పాయింట్ అవుట్ చేస్తున్నారు!

ఇక ఇది గమనించిన కొందరు ఆచార్య అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం.. భారీ స్థాయిలో హిట్ సాధించి పెట్టిన త్రిబుల్ ఆర్ రాజమౌళి అన్నట్లు పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఇక ఈ మాటలకు దర్శక ధీరుడు రాజమౌళి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

- Advertisement -