Hero Rana: హీరోగా పెట్టి పూరీ జగన్నాదే చేతులు కాల్చుకున్నాడు.. ముదురు ఏం కాదు కానీ?

Akashavani

Hero Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దగ్గుబాటి వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన రానా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎంతటివారికైనా హిట్ ఫ్లాప్ లు రావడం సర్వసాధారణం.ఎంత సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ వారికంటూ సొంత నైపుణ్యం లేకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టం. అయితే దగ్గుబాటి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రానా తన టాలెంట్ తో వరుసగా సినిమాలు అందుకుని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇలా ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రానా గురించి డైరెక్టర్ గీతాకృష్ణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానా హీరో మెటీరియల్ కాదని ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రానా చాలా హైట్ ఉండటం వల్ల ఆయన హీరోగా,అందంగా కనిపించరని గీతాకృష్ణ వెల్లడించారు. ఇలా ఎత్తుగా ఉండే వాళ్ళకి ఇండస్ట్రీలో అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. ఇలాంటి వారు ఇండస్ట్రీలో క్లిక్ కావడం చాలా కష్టం.

Hero Rana: రానా వయసు కూడా చిన్నదే కానీ…

ఇక రానాతో కలసి పూరి జగన్నాథ్ సినిమా చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇక రానా, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన నేను నా రాక్షసి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇలా పొడవు ఉన్న వారితో సినిమాలు చేస్తే సినిమాలు పెద్దగా క్లిక్ కావని ఆయన తెలిపారు. నిజానికి రానా వయసు రీత్యా చాలా చిన్నవారే, ఆయన ముదురేమి కాదు. ఆయన వయసు కూడా ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోల వయసు అయినప్పటికీ అతను పొడుగ్గా ఉండటం వల్ల అలా కనిపిస్తారు అంతే అంటూ గీత కృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

- Advertisement -