Gauri Khan: ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ అంటే తెలియని వారుండరు. షారుఖ్ ఖాన్ 100 సినిమాలకు పైగా హీరోగా నటించాడు. సినిమాలలో హీరో గానే కాకుండా నిర్మాత టీవీ ప్రముఖుడిగా, నిర్మాతగా కూడా పనిచేశాడు. షారుఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో అభిమానులు ఉన్నారు.
1992లో దివానా అనే సినిమా ద్వారా బాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే చాలా సినిమాలను చేసి స్టార్ గా ఎదిగిపోయాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ కు ఆయన సహ చైర్మన్ గానూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోని కోల్‌కత నైట్ రైడర్స్ టీంకు సహ యజమానిగా ఉన్నాడు.
షారుక్ ఖాన్ ప్రముఖ నిర్మాత అయిన గౌరీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. గత సంవత్సరం షారుక్ ఖాన్ కుమారుడు అయిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా విషయం తెలిసిందే. దీనిపై మొదటిసారిగా మాట్లాడిన ఆయన భార్య గౌరీ ఖాన్ కాఫీ విత్ కరణ్ షో లో తన కొడుకు అరెస్టు అయినప్పుడు మా కుటుంబమంతా ఎంతో బాధపడ్డామని చెప్పింది. అంత బాధపడిన మళ్లీ ధైర్యంగా నిలబడ్డామని కూడా చెప్పింది.
Gauri Khan: కొడుకు అరెస్ట్ తో క్రుంగిపోయిన తల్లి గౌరీ ఖాన్..
నా కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయినప్పుడు తల్లిగా నా బాధ వర్ణించలేనిది అని చెప్పింది. కానీ ఆ సమయంలో చాలామంది మా కుటుంబానికి అండగా ఉన్నారు. మాకు పరిచయం లేని వారు కూడా మెసేజ్లు, కాల్స్ చేసి నన్ను ఓదార్చరు. ఆ సమయంలో మా కుటుంబానికి అండగా ఉన్న అందరికీ నా ధన్యవాదాలు అంటూ గౌరీ ఖాన్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం గౌరీ ఖాన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.