Gold Rate: బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు ప్రతిరోజు ధరను చూసి వెనుకడుగు వేస్తున్నారు. ఇక బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఇంకాస్త తగ్గుతాయేమోన్న ఆశతో వచ్చిన అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. దీంతో మళ్లీ ధరలు పెరగటంతో బాధపడుతున్నారు. నిజానికి బంగారం ధరలు రోజు రోజుకు తరుగుతూ.. పెరుగుతూ.. ఉన్నాయి. ఇక ఇలా ఉండటంతో ఎప్పుడు కొనుగోలు చేయాలి అనే ఆలోచనలో పడుతున్నారు.
పైగా ప్రస్తుతం కోవిడ్ మళ్లీ వ్యాపిస్తుంది అని వార్తలు బాగా వస్తున్నాయి. దీంతో మళ్లీ ధరలు పెరుగుతాయేమో అని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే ధరలు బాగా ఎక్కువగా ఉండటంతో తగ్గే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటే ధరలో మార్పు ఉంటుందని తెలుస్తుంది. దీంతో ఇప్పుడే ఉన్న ధరకు బంగారం కొనుగోలు చేస్తే కొంతవరకు మేలు అన్నట్లుగా అనిపిస్తుంది.
మరి ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకు నిన్నటి కంటే ఈరోజు కాస్త తగ్గిందని చెప్పవచ్చు. నిన్నటి ధర కంటే 70 రూపాయలు మాత్రమే తగ్గింది. ఇక ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. హైదరాబాదులో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నిన్నటి కంటే 70 రూపాయలు తగ్గి రూ.50,080 కు చేరుకుంది.
Gold Rate:
ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,630 కు చేరుకుంది. ఇక ఒక కిలో వెండి ధర రూ. 74,000 పలుకుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,080 లో ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,630 లో ఉంది. కిలో వెండి ధర రూ.74 వేలు ఉంది. ఇక ప్రస్తుతం ధరలు ఇలా ఉండగా రేపు రేపు కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటే పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.