Google : ఒక వ్యక్తి తప్ప తాగి గూగుల్ ఆఫీసుకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు గూగుల్ ఆఫీసుకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. ఒక వ్యక్తి ముంబైలో ఉన్న గూగుల్ ఆఫీసుకు ఫోన్ చేశాడు. పూణెలో ఉన్న గూగుల్ ఆఫీసులో బాంబు ఉందంటూ పెద్ద బాంబు పేల్చాడు. దీంతో గూగుల్ ఉద్యోగులు బెంబేలెత్తారు. వెంటనే పూణె పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు పూణెలో ఉన్న గూగుల్ ఆఫీసుకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు.
ఏ జాడ దొరకలేదు. దీంతో అసలు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆరా తీశారు. దీంతో అది ఫేక్ కాల్ అని తెలిసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు… హైదరాబాద్ నుంచి ఆ ఫోన్ వచ్చినట్టు గుర్తించి వెంటే ఆ వ్యక్తిని పట్టుకోవడం కోసం ట్రాక్ చేసి చివరికి ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు.
Google : ఫేక్ కాల్ ఎందుకు చేశావని ప్రశ్నిస్తే ఏం చెప్పాడో తెలుసా?
మద్యం మత్తులో ఉండి అలా ఫేక్ కాల్ చేశానని ఆ వ్యక్తి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉంటే గూగుల్ ఆఫీసుకు ఫోన్ చేయడం ఏంటి.. అంటూ పోలీసులు తలలు పట్టుకున్నారు. ఫేక్ కాల్ అని తెలిశాక గూగుల్ ఆఫీసు ఉద్యోగులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి 7.54 నిమిషాలకు ఆకతాయి ఫోన్ చేయడంతో ఒక రెండు మూడు గంటల పాటు పూణెలోని గూగుల్ ఆఫీసులో హడావుడి చోటు చేసుకుంది. చివరకు అది ఆకతాయి పని అని తెలిసి పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.