Guppedantha Manasu April 29 Episode: వసును దూరం చేసుకున్న రిషి.. ఎంట్రీ ఇచ్చిన సాక్షి!

Akashavani

Guppedantha Manasu April 29 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో వసు దగ్గరికి వెళ్లిన జగతి.. పిలిచావంటా ఎందుకు అని అడుగుతుంది. దాంతో వసు నేను పిలవలేదు మేడం అనటంతో నేనే పిలిచాను అంటూ దేవయాని లోపలికి వచ్చి డోర్ పెడుతుంది. ఇక వాళ్ళ దగ్గరికి వచ్చి తన మాటలతో వారిని గోరంగా అవమానిస్తుంది.

ఆ మాటతో వసును అవమానించిన దేవయాని..

జగతి ముందు వచ్చినందుకు జగతిపై తన మాటలతో పగ తీర్చుకుంటుంది. ఇక వసును ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్న ఉద్దేశంతో నానా రకాల మాటలు మాట్లాడి తనను మరింత బాధ పెడుతుంది. రిషి రమ్మంటే ఇక్కడకు వస్తావా అంటుంది. అంతేకాకుండా రాజీవ్ ను మధ్యలో లాగుతూ.. మీ బావని నువ్వే ఏర్పాటు చేసావా అని దారుణంగా అవమానిస్తుంది. కావాలని మీ బావతో ఈ నాటకం ఆడించావు కదా అని అనడంతో వెంటనే జగతి కోపంతో రియాక్ట్ అవుతుంది.

లేదంటే నేనే మీ బావను పెట్టి ప్లాన్ చేసానేమో అని అనుకుంటున్నారా అని అనడంతో వెంటనే జగతి నాకు మీ మీదే అనుమానం ఉంది అంటుంది. అవును నాకు తెలుసు మీరు ఇలాగే అనుకుంటారు అని అంటుంది. అయితే ఈ విషయంను నిజం కూడా చేస్తారు అని అనడంతో వసు బాధపడుతూ నేను ఇక్కడనుంచి వెళ్ళిపోతాను అని అంటుంది.

వసుకు ధైర్యం ఇచ్చిన మహేంద్రవర్మ..

అప్పుడే మహేంద్రవర్మ రావడంతో లోపల ఉన్న దేవయాని చూసి షాక్ అవుతాడు. జగతి వాళ్ల దగ్గరకు వెళ్లి వసుకు ధైర్యం ఇస్తాడు. ఇక్కడే ఉండమని చెబుతాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే రిషిని అవమానించినట్లు అవుతావు అని ఇక్కడే ఉండు అని చెప్పి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక మరుసటి రోజు దేవయాని ధరణి తో ఇల్లు అన్నదానం సత్రం లా మారింది అంటూ జగతి, వసు లను ఉద్దేశించి మాట్లాడుతుంది.

ఇక అదే సమయంలో అక్కడకు మహేంద్రవర్మ, జగతి రావడంతో వాళ్ళు బాధపడుతుంటారు. ఇక దేవయాని మాత్రం తన నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో వసు తన లగేజీ తో బయటకు వస్తుంది. దేవయాని అది చూసి సంతోషపడుతుంది. ఇక మహేంద్రవర్మ వాళ్లు కూడా ఎంత చెప్పినా వసు వినకుండా ఇంట్లో నుంచి వెళ్లడానికి సిద్ధమవుతోంది.

Guppedantha Manasu April 29 Episode: వసు అవుట్.. సాక్షి ఎంట్రీ..

ఇక రిషి వసుని చూసి ఆపుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. వసు మాత్రం ఏ ఉద్దేశంతో ఇక్కడ ఉండాలి అనడంతో రిషి ఏం చెప్పలేక పోతాడు. ఇక వసు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. రిషి మాత్రం బాధపడుతూ ఒంటరిగా ఫీల్ అవుతాడు. తరువాయి భాగం లో రిషి మాజీ లవర్ సాక్షి రావటంతో అది చూసిన దేవయాని కరెక్ట్ టైంకి వచ్చావు సాక్షి అని మురిసిపోతుంది.

- Advertisement -