Health: ప్రస్తుత సమాజంలో ఏ దేశంలో చూసినా కరోనా వ్యాధి రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యాధి రావడం వల్ల చాలా దేశాలలోని ప్రజలు వారి ఆరోగ్యం పై శ్రద్ధ ఉంచారు. ప్రజలు శరీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే వారి జీవన విధానంలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేయాలి.
దానితో పాటు మనిషి జీవితంలో సంతోషంగా కూడా ఉండాలి. ప్రజలు ఇలా సంతోషంగా ఉంటే జీవితంలో చాలా బాగున్నారని దాని అర్థం కాదు. వారి మానసిక పరిస్థితి శరీర ఆరోగ్యం బాగుంటేనే వారు బాగున్నట్లు అర్థం. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మన శరీర భాగాలకు మెదుడికి రక్తప్రసరణ బాగా పెరిగి అవి ఆరోగ్యం గా ఉంటాయి.
ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని నియమాలు..
వ్యాయామం అంటే ఏదో జిమ్ కి వెళ్లి బరువులు ఎత్తడం కాదు. మీకు ఇష్టమైన ఆట ఆడడం కానీ, కాస్త వేగంగా నడవడం కానీ చేసిన సరిపోతుంది. ఒక మూడు లీటర్ల నీరు తాగడం కూడా ఆరోగ్య నియమాలలో ముఖ్యమైనది. అంత నీరు తాగలేక పోతే మజ్జిగ, కొబ్బరి నీరు కూడా తాగవచ్చు. దీనివల్ల మన శరీరంలోని వ్యర్ధాలు చెమట రూపంలో బయటకు వెళ్తాయి. మన శరీరంలోని వేడి తగ్గి మన ఆరోగ్యం బాగా ఉంటుంది.
ఆరోగ్య నియమాలలో ఎనిమిది గంటలు నిద్ర చాలా ముఖ్యమైనది. ఇలా నిద్రపోవడం వల్ల పగటిపూట మనం మన శరీరానికి ఇచ్చిన శ్రమ అంతా తగ్గిపోయి మళ్లీ ఉదయం లేవగానే మనం చాలా ఫ్రెష్ గా ఉంటాం. శృంగారం కూడా మన ఆరోగ్య నియమాలలో ఒకటి అని చెప్పవచ్చు. శృంగారం వల్ల మన శరీరం రీ ఫ్రెష్ అవుతుంది. ఒత్తిడి తగ్గి మన శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి.
Health:
జీవితంలో ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి స్నేహితులు ఉంటారు. ఆరోగ్య నియమాలలో ఫ్రెండ్స్ తో గడపడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్నేహితులు దగ్గర ఎక్కువగా చనువుగా ఉంటారు కాబట్టి వారి దగ్గర మీరు మనసు విప్పి మాట్లాడగలరు. కొత్త కొత్తగా ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండటం కూడా మన ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజుకు ఒక పది నుంచి 20 నిమిషాల వరకు ధ్యానం చేయడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా నవ్వు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.