నిఖిల్ తండ్రి మరణానికి కారణం ఆ వ్యాధినేనా..!

Akashavani

సినీ లవర్స్ కి హీరో నిఖిల్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డే చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్నాడు. ఇక ఆపై పలు సినిమాల్లో నటించి నిఖిల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

ఇటీవల వచ్చిన కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాల తో యువతులు సైతం ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం సినిమాల పరంగా కొంత గ్యాప్ ఇచ్చిన నిఖిల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటాడు. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ నెటిజన్లకు షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ్ గురువారం రోజున కన్నుమూశాడు.

గత కొన్ని సంవత్సరాలుగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న అతడు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తన ఆఖరి శ్వాస విడిచాడు. ఇక నిఖిల్ తన తండ్రి మరణాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక చాలా బాధపడ్డాడు. కాగా నాన్న తో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటూ నిఖిల్ ఒక నోట్ ను బయట పెట్టాడు. తన నాన్నతో కలిసి ఎన్నో గడిపిన తీపి జ్ఞాపకాలను ఆ నోట్ లో పంచుకున్నాడు.

అంతేకాకుండా నిఖిల్ తండ్రి ఎంతో మంది విద్యార్థులకు దారి చూపినట్లు ఆ నోట్ లో తెలియ చేసాడు. ఇక నిఖిల్ ను తెరపై చూడాలి అనేది కూడా వాళ్ల నాన్నగారి కల అని వెల్లడించాడు. అంతే కాకుండా జేఎన్టీయూలో ఎలాక్ట్రానిక్స్ ఇంజనీర్‌గా టాప్ ర్యాంకర్.. అంతే కాకుండా ఆయన తండ్రి ఇప్పుడు కష్టాన్ని నమ్ముకున్నాడు అన్నట్లు తెలియ చేసాడు. కనిగిరి కోసం ఆయన ఎంతో కష్ట పడ్డట్లు వివరించాడు.

Nikhil Siddharth: నిఖిల్ తండ్రికి సోకిన వ్యాధి ఇదే!

ఇక చివరికి ఆయన ఎంజాయ్ చేయాల్సిన సమయం లో ఆ అరుదైన వ్యాధి బారిన పడినట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ వ్యాధి ఏమిటంటే కార్టికోబాసల్ డీజెనరేషన్ ఈ వ్యాధితో నిఖిల్ తండ్రి గత ఎనిమిదేళ్లుగా పోరాడినట్లు నిఖిల్ ఆ నోట్ లో వెల్లడించాడు.

- Advertisement -