Krithi Shetty: ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమానే మంచి విజయం కావడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ఇలా తెలుగు భాషలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ సినిమాలలో కూడా నటిస్తూ కృతి శెట్టి ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఈమె నితిన్ సరసన రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి తన సినీ కెరియర్ గురించి అలాగే జీవితంలో తనకున్న కొన్ని లక్ష్యాల గురించి బయటపెట్టారు. ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాల గురించి ఈమెను ప్రశ్నించగా ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచనలు లేవని తెలిపారు.
Krithi Shetty: ఎన్జీవో సమస్థను స్థాపించడమే లక్ష్యం…
ఇక సినిమా కాకుండా జీవితంలో మరేవైనా లక్ష్యాలు ఉన్నాయా అని యాంకర్ నుంచి ఈమెకు ప్రశ్న ఎదురయింది. ఇక ఈ ప్రశ్నకు కృతి శెట్టి సమాధానం చెబుతూ తనకు సినిమాలు కాకుండా ఒక ఎన్జీవో సమస్థను స్థాపించడమే తన లక్ష్యమని తెలిపారు. త్వరలోనే ఈ ఎన్జీవో సమస్థను ఏర్పాటు చేసే పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈమె బాల దర్శకత్వంలో సూర్య సరసన నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.