Intinti Gruhalakshmi May 11 Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇక మాతృ దినోత్సవ వేడుకలో తులసి ఉత్తమ తల్లి గా గుర్తింపు పొందగా కలెక్టర్ చేతుల తులసి అవార్డు అందుకుంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ కలెక్టర్ ఎవరో కాదు ప్రవళిక అని తెలియటంతో తులసి తో పాటు తన కుటుంబసభ్యులు కూడా షాక్ అవుతారు. ఇక మొత్తానికి ప్రవళిక చేతుల
మీదుగా అవార్డు అందుకుంటుంది తులసి. దాంతో లాస్య కు మండిపోగా ఇంటికి వెళ్లి తన కొడుకుని కొట్టాలని చూస్తుంది.
దాంతో నందు అడ్డు పడగా.. నందు పై కూడా అరుస్తుంది. నాకే కాకుండా నీకు కూడా అవమానం జరిగింది కదా అంటూ ఓ రేంజ్ లో తిట్టి వెళ్తుంది. ఇక అక్కడే ఉన్న లక్కీ నందు వైపు కోపంగా చూస్తూ నువ్వు మా డాడీ కాదు కదా అయినా కూడా నేను మమ్మీ గొడవ పడుతుంటే మధ్యలో ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. దాంతో నందు అంటే నువ్వు నన్ను డాడీ అని పిలుస్తాను అంటావా అని.. అనడంతో వెంటనే అలా పిలవాలంటే నువ్వు నాకు అలవాటు పడాలి అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
సీన్ కట్ చేస్తే..
తులసి.. ప్రవళిక ను కలెక్టర్ అని ఎందుకు చెప్పలేదు అంటూ కాస్త అలిగినట్లుగా చెబుతుంది. దాంతో ప్రవళిక మన చిన్ననాటి స్నేహితులం కాబట్టి హోదా తో పని ఏముంది అని కాసేపు మళ్ళీ జీవితం గురించి చెబుతుంది. ఆ తర్వాత తులసి తన గులాబీ మొక్క తో తన మనసులో ఉన్న మాటలను చెప్పుకొని సంతోషపడుతుంది. అంతే కాకుండా ఒక పాట పాడు తూ డాన్స్ కూడా చేస్తూ కనిపిస్తుంది. తులసిని చూసిన పరంధామయ్య దంపతులు, దివ్య సంతోషంగా చప్పట్లు కొడతారు.
తులసి సింగర్ అయ్యే అవకాశాలు ఇలా..
తులసి కాస్త సిగ్గు పడినట్లు కనిపించగా.. వెంటనే దివ్య ఆది వీడియో తీశాను అని మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని అంటుంది. దాంతో వద్దు అని తులసి దివ్య ని పట్టుకోవాలని చూడగా దివ్య దొరక్కుండా పారిపోతుంది. దీనిని బట్టి చూస్తే ఒకవేళ దివ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లయితే తులసికి కచ్చితంగా సింగర్ అయ్యే అవకాశం వస్తుంది అన్నట్లుగా కనిపిస్తుంది.
Intinti Gruhalakshmi May 11 Episode: ఇతగాడి భిక్ష నాకు వద్దు అంటూ నందుని అవమానపరిచిన తులసి..
ఆ తర్వాత తులసి ఉదయాన్నే లేచి తన పనులు చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్తుంది. ఇక తరువాయి భాగంలో తులసి ఇంటర్వ్యూకు వెళ్ళగా అక్కడ నందు కూడా ఉంటాడు. ఆ ఇంటర్వ్యూ చేసే అతను నందు ఫ్రెండ్ అవటంతో.. వెంటనే అతను మీరు నందు భార్య అని తెలిస్తే ఇంటర్వ్యూ కూడా అవసరం లేదు ఉద్యోగం మీదే అని అంటాడు. దాంతో తులసి వెంటనే.. ఆడదంటే కీలుబొమ్మగా చూసి ఇతగాడి బిక్ష నాకు అవసరం లేదు అని నందుని అవమానపరుస్తూ మాట్లాడుతుంది.