Janaki Kalaganaledu July 13 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మల్లిక గదిలో కూడా జ్ఞానంబ పూలతో ఏర్పాట్లు చేసి పెట్టడంతో.. వెంటనే మల్లిక జానకి గదిలో కూడా ఈ ఏర్పాట్లు చేయొచ్చు అని అనుకుంటుంది. ఆ తర్వాత ఎక్కడ ఆస్తి పోతుందో అన్న ఉద్దేశంతో.. తను త్వరగా పిల్లలను కనాలని అనుకుంటుంది. కానీ జానకి వాళ్ళ ఏకాంతాన్ని పాడుచేయాలని ప్లాన్ చేస్తుంది.
పాల గ్లాసులో నిద్ర మందు కలిపిన మల్లిక..
మధ్యలో విష్ణు తన మాటలతో మల్లికపై సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మల్లిక వంటగదిలోకి వెళ్లి అక్కడున్న ఒక పాల గ్లాసులు నిద్రపోయే మందు అందులో వేసి కలుపుతుంది. ఆ సమయంలో అక్కడికి జానకి రావడంతో జానకి తను మందు కలుపుతున్న దృశ్యాన్ని ఎక్కడ చూసిందో తెగ టెన్షన్ పడుతుంది.
ఇక జానకి తన దగ్గరికి వచ్చి చీర బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తుంది. మల్లిక కూడా రెండు మూడు మాటలు జానకి పై విసురుతుంది. ఆ తర్వాత మల్లిక మనం త్వరగా పిల్లలను కానీ అత్తయ్య చేతిలో పెట్టాలి అని.. ఆమె కోరిక తీర్చాలి అని అంటుంది. అక్కడున్న పాల గ్లాస్ తీసుకోమని దానికి కి చెప్పి తాను మందు కలిపిన మర్చిపోయి తీసుకొని వెళుతుంది.
స్పృహ తప్పిన జానకి, రామ..
ఇక విష్ణు దగ్గరికి వచ్చి కొత్త కొత్తగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి విష్ణు ఏదో తేడాగా ఉంది అన్నట్లు మాట్లాడుతాడు. ఆ తర్వాత విష్ణు కాస్త పాలు తాగి మల్లికకు ఇస్తాడు. ఇక మల్లిక తాగకుండా జానకి వాళ్ళ స్పృహ తప్పారో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జానకి పాల గ్లాస్ తీసుకొని లోపలికి రావటం రామకి పాలు ఇవ్వడం తాను కూడా పాలు తాగడం.. ఆ తర్వాత ఇద్దరు స్పృహ తప్పి జరుగుతుంది.
రివర్స్ తిరిగిన మల్లిక సీన్..
కానీ ఇదంతా మల్లిక ఊహించుకుంటుంది. అయిపోయింది అంతా అయిపోయింది అని తెగ మురిసిపోతుంది. ఆ తర్వాత అదంతా కల అని అనుకుంటుంది. కానీ అప్పటికే విష్ణు స్పృహ కోల్పోయిన నిద్రలోకి జారుకుంటాడు. వెంటనే మల్లిక తను ఏ గ్లాసు పట్టుకొని వచ్చాను సీన్ రివర్స్ చేసుకొని చూడటంతో కానీ మందు కలిపిన గ్లాస్ తీసుకొచ్చింది అని తెలుసుకుంటుంది.
మరోవైపు జానకి రామ దగ్గరికి రాగా రామ మళ్ళీ పురాణం మొదలుపెడతాడు. మీ చదువు కల తీరినాకే అమ్మ కోరిక తీర్చుదాం అని అంటాడు. దాంతో జానకి కూడా సరే అంటుంది. ఆ తర్వాత జానకి పాలు తాగి రామకు ఇవ్వడంతో రామ.. గ్లాస్ కు లిప్స్టిక్ అంటిందని పక్కకు జరిపి తాగుతాడు. జానకి అది చూసి తన మీద ప్రేమ లేదేమో అని అనటంతో.. వెంటనే రామ లిప్ స్టిక్ అంటిన చోటే పాలు తాగుతాడు.