Jhonny Depp: హాలీవుడ్ నటుడు జానీ డెప్ మరొకసారి వార్తల్లో నిలిచాడు. అయితే మొన్నటి వరకు అతని భార్య అంబర్ హెరాల్డ్ తో కోర్టులో పోరాడి కోర్టులో గెలిచిన జానీ అక్కడితో ఆ సమస్య తీరిపోయింది అని అనుకోగానే ఇంతలోనే మరొక రూపంలో అతనికి సమస్య మొదలయ్యింది. అతని మాజీ ప్రేయసి ఎలెన్ బార్కిన్ అతనిపై తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. తాము తొలిసారి శారీరకంగా కలవడానికి ముందు అతడు తనకు క్వాల్యూడ్ అనే డ్రగ్ ఇచ్చాడని ఆమె ఆరోపించింది. అయితే ఆ సమయంలో అతడు బాగా తాగి తనని కంట్రోల్ చేయడం మాత్రమే కాకుండా నోటికి వచ్చిన విధంగా మాట్లాడాడు అని ఆమె తెలిపింది.
అయితే జానీ భార్య అంబర్ హెరాల్డ్ వేసిన పరువు నష్టం దావా కేసులో సాక్షిగా ఉన్న ఎలెన్, జానీ ఇలాంటి వాడు అంటూ కోర్టు డాక్యుమెంట్స్ లో ఆమె పేర్కొంది. అంతేకాకుండా అతడు డ్రగ్స్ తీసుకోవడం తాను కళ్ళారా చూశానని తెలిపింది. అంతే కాకుండా తనకు డ్రగ్స్ ఇచ్చి మరీ శృంగారంలో పాల్గొనేలా చేశాడు అని ఆమె ఆరోపించింది. జానీ ఒక పచ్చి తాగుబోతు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు.. మేము చాలా రోజుల పాటు కలిసే ఉన్నాం.. వారంలో రెండు రోజులు మా ఇంటి దగ్గర మరో రెండు రోజులు వారి ఇంటి దగ్గర కలిసి వాళ్ళం. అలా మేము కలిసిన మొట్టమొదటిసారి కూడా అతడు తాగే వచ్చాడు.. నాకు డ్రగ్ ఇచ్చాడు.. ఆ మత్తులో నన్ను ఎన్నో మాటలు కూడా అన్నాడు.
Jhonny Depp: నోటికి వచ్చిన విధంగా బూతులు మాట్లాడేవాడు..
బూతులు తిట్టాడు. అనంతరం నాతో శృంగారం చేశాడు అని చెప్పుకొచ్చింది ఎలెన్. అలాగే ఎప్పుడూ కూడా తనని జానీ ఒక బానిసలా ఉండాలి అనుకునేవాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా ఆమె ఎవరితో అయినా కనిపించినా ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారు?అంటూ ప్రశ్నలతో వేదించేవాడు అని చెప్పుకొచ్చింది. మరింత దారుణంగా ఎవరితో పడుకున్నావు అంటూ అసభ్యంగా తిట్టిపోసేవాడు అని ఆమె తెలిపింది. ఇది కాకుండా ఒకసారి తాగిన మైకంలో తన పై బాటిల్ తో కూడా విసరాడు అని ఆమె ఆరోపించింది. మరి ఈ వ్యాఖ్యలపై జానీ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.