Leena Sidhu: ప్రముఖ నటి లీనా సిద్దు అంటే చాలా వరకు గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఈమె ఎక్కువగా సినిమాల్లో నటించలేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో మళ్లీ మాల ఎంటర్టైన్మెంట్ లో శ్యామ్ కేర్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమాలో ఈమె ఓ కీలకమైన పాత్ర లో నటించింది.
ఈ సినిమాలో అంధురాలిగా చాలా అద్భుతంగా నటించింది. అయితే ఈమె అరుంధతి సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమెను గుర్తుపట్టాలంటే అరుంధతి సినిమాలోని టీచర్ గా చెప్పుకోవచ్చు. ఛార్మీ నటించిన కావ్యస్ డైరీ అనే సినిమాలో కూడా ఓ కీలకమైన పాత్రలో నటించింది.
అలాగే హ్యాపీ హ్యాపీగా సినిమాలో కూడా నటించింది. లీనా సిద్ధు ఒక తెలుగు అమ్మాయి. అయినప్పటికీ ఈమెకు సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. దీంతో ఈమె బాలీవుడ్ లోకి వెళ్ళింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. ఆ సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు మాత్రమే వచ్చాయి.
ఇక ఈమె మొహంలో, శరీరాకృతి లో మార్పులు రావడంతో వచ్చే ఆ చిన్న చిన్న పాత్రల అవకాశాలు కూడా పోయాయి. అప్పటినుంచి ఈమె కనుమరుగైపోయింది. చివరిగా.. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్ళిన ఆమె ఇక టాలీవుడ్ కి తిరిగి రాలేదు. ఇలా ఒకటి రెండు మూడు సినిమాలతో ఈమె సినీ కెరీర్ పడిపోయింది.
ఒకప్పుడు కూడా ఆమెకు సరైన పాత్రలు రాకపోవడం వల్లనే ఆమెకు సినిమాలో ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఆమె సరైన పాత్రలను ఎంచుకొని ఉంటే ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ గా ఉండేది. అయితే తాజాగా ఈమె తన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Leena Sidhu: అరుంధతి ఫేమ్ లీనా సిద్దును చూస్తే ఆశ్చర్యపోతారు..
అప్పటికి ఇప్పటికి గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందనే చెప్పాలి. దీన్ని చూసిన నెటిజన్లు ఈమె ఎవరా అని ఆలోచనలో పడిపోతున్నారు. తీరా తెలుసుకున్నాక ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈమె సినిమాల్లో తిరిగి మళ్ళీ వస్తుందేమో చూడాలి.