Mahesh Babu: పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొడుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. ఏకంగా వార్!

Akashavani

Mahesh Babu: మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సర్కార్ వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మహేష్ బాబు ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమా మరొక రోజు లో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో కేవలం ఒక గంట వ్యవధిలోనే నైజాం ఏరియాలో ఒక కోటి టికెట్లు ముందుగా బుక్ అయ్యాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతూ ట్వీట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లో భాగంగా కోటి టికెట్లు బుక్ కావడం కోసం మూడు రోజుల సమయం పట్టింది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మహేష్ అభిమానులు మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Mahesh Babu: మహేష్ బాబు అడ్డా..

అది నైజం మహేష్ బాబు అడ్డారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాకి మహేష్ బాబు సినిమాని కంపేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవ పడుతున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా సినిమాపై భారీ అంచనాలు పెంచిన మహేష్ బాబు థియేటర్ లో ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -