Bitthiri sathi: బిత్తిరి సత్తి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా.. కన్నీళ్లొచ్చేలా నవ్విన మహేష్ బాబు!

Akashavani

Bitthiri sathi: తెలుగు ప్రేక్షకులకు బిత్తిరి సత్తి పేరు కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన ప్రత్యేకమైన నడవడికతో.. తన భాష యాస తో ఇండస్ట్రీలో నవ్వులు పండిస్తూ ఉంటాడు. ఇక తన యాసతో ఎంత కోపంగా ఉన్న సెలబ్రేటీ ను అయినా ఇట్టే ఫిదా చేస్తాడు. ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో బిత్తిరి సత్తి హాస్య నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక బిత్తిరి సత్తి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. అందులో సత్తి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇటీవల త్రిబుల్ ఆర్ టీం ను బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేసి ఎన్టీఆర్ రామ్ చరణ్ లను ఒక రేంజ్ ల లో నవ్వించాడు. ఇక తాజాగా సర్కారు వారి పాట ప్రమోషన్లో భాగంగా బిత్తిరి సత్తి మహేష్ బాబు ను ఇంటర్వ్యూ చేశాడు.

ఆ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మరో లెవెల్లో నవ్వేసాడు. ఎంతలా అంటే.. నవ్వి నవ్వి మహేష్ బాబు బుగ్గలు రెండు ఎర్రగా మారి పోయాయి. ఆ క్రమంలో కండలు గురించి అడిగాడు.. వంద గోలీలు అంటూ బుడ్డ రీల్ డైలాగ్ గురించి అడగడంతో మహేష్ నవ్వాపుకోలేక పోయాడు. దాంతో మహేష్ బాబు నువ్వు మాట్లాడేది ఏ భాష? ఈ యాస అని అడుగుతాడు.

దానికి బిత్తిరి సత్తి యాస, భాష.. నేనే కనిపెట్టాను అని చెబుతాడు. దాంతో మహేష్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? అని మళ్లీ నవ్వాపుకోలేక పకపకా నవ్వేస్తాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతుంది. ఇక మహేష్ బాబు అభిమానులు ఈ వీడియో చూసి మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్కెయండి.

మహేష్ అడిగిన ప్రశ్నకి బిత్తిరిసత్తి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు!

ఇక ప్రస్తుతం బిత్తిరి సత్తి స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేస్తూ తనదైన స్టైల్ లో కడుపుబ్బ నవ్విస్తున్నాడు. అందరినీ నవ్వించే బిత్తిరి సత్తి కెరీర్ పరంగా మూడు పూలు ఆరు కాయలు లాగా ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -