Megastar Chiranjeevi: తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారుండరు. ఆయనకు చిత్ర సినీ పరిశ్రమల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు 150 కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. యువ తరానికి స్ఫూర్తిగా మారాడు.తెలుగు తెరపై తిరుగులేని రారాజుగా పేరు తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
సినిమాల పరంగా ఎప్పుడో సెంచరీ కొట్టేసిన మెగాస్టార్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దూకుడుగా అడుగులేస్తున్నారు. అయితే చిరంజీవి తాజాగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. దివంగత ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు మనవరాలైన శ్రీజ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కించారు.
అయితే అమ్మాయిలు ఇండస్ట్రీ కి రావడం మంచిదని మెగాస్టార్ శ్రీజను ప్రోత్సహించారు. అలాగే మా ఇంటి నుంచి కూడా మా ఇద్దరు అమ్మాయిలు వచ్చారని అన్నాడు. అదే విధంగా ఏడిద నాగేశ్వర రావు తో ఆయన కు ఉన్న తీపి జ్ఞాపకాలను తలచుకొంటూ ఆనందం వ్యక్తం చేశాడు. నేను కూడా ఆయన కుటుంబం లో ఒక వ్యక్తిని అని సంతోష పడ్డాడు. ఈ క్రమంలో లో యాంకర్ సుమ చిరంజీవి కు మీ ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని తెలియజేయండి అని ప్రశ్న వేసింది.
Megastar Chiranjeevi: నాగబాబు వల్ల చిరంజీవికి జరిగిన అనుభవం ఇదే..
అప్పుడు చిరంజీవి తనకు ఉన్న ఆ దారుణమైన అనుభవం అందరికీ తెలియజేశాడు. తన చిన్నతనం లో సీనియర్ ఎన్టీఆర్ సినిమా చూడడానికి ఆయన, తన తమ్ముడు నాగబాబును తీసుకొని తన స్నేహితుడితో వెళ్ళాడట. అక్కడ జనాలు ఎక్కువ ఉండడం తో చిన్న పిల్లవాడు అయిన నాగబాబు చమటలు పట్టి, ఉక్కిరిబిక్కిరి అయిపోయాడట. అక్కడే ఉన్న ఆయన తండ్రి అది చూసి జనాలలో వాడు చనిపోతే ఎలా అని చిరంజీవిని నడి రోడ్డుపై తనను చావు దెబ్బలు కొట్టాడని, ఇదే తన ఫస్ట్ డే ఫస్ట్ షో దారుణమైన అనుభవం అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.