Nayanthara: తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి నయనతార. అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోలు అందరి సరసన నటించిన లేడీ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకుంది. హీరోయిన్లలో ఏ హీరోయిన్ కి లేని స్టార్ డమ్ నయన్ కు ఉంది అనే చెప్పవచ్చు. రీసెంట్ గా విఘ్నేష్ శివన్ అనే దర్శక నిర్మాత ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన వెంటనే తన భర్తతో వరుస హనీమూన్ లతో బిజీగా ఉంది.
వరుస గా రెండు మూడు హనీమూన్ల కు వెళ్లి వచ్చారు ఈ కోలీవుడ్ రొమాంటిక్ కపుల్ అని టాక్ ఉంది. అంతటితో ఆగకుండా హగ్గులు, ముద్దుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి రచ్చ రచ్చ చేశారు ఈ రొమాంటిక్ కపుల్. తాజాగా ఈ జంట గురించి ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారింది. నయనతార పిల్లలకు జన్మనివ్వడం కష్టమట. ఎందుకంటే ఆమె హెల్త్ కండిషన్ సరిగా లేదని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
నయనతార కు ఉన్న సమస్య ఏంటంటే…
నయనతార కు మొదటి నుంచి గర్భసంచి బలహీనంగా ఉందని ఆమె గర్భం దాల్చడం చాలా కష్టమని చెబుతున్నారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ జంట ఒక బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధపడే వివాహం చేసుకున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. నయనతార అద్దెగర్బం ద్వారా పిల్లల్ని కనాలని అనుకుంది. కానీ శివన్ ఆ పనికి ఒప్పుకోలేదు. ఈ జంట పెళ్లికి ముందే ఒక అనాధ బిడ్డను దత్తత తీసుకోవాలని ఒప్పందం చేసుకుందట.
Nayanthara: నయనతారకు ఆ సమస్య ఉండటంతో తట్టుకోలేకపోతున్న అభిమానులు..
దానితో ఇప్పుడు ఈ న్యూస్ కోలీవుడ్ లో వైరల్ అయింది. అన్ని కోట్ల ఆస్తి ఉన్న నయనతార కు తల్లి అయ్యే భాగ్యం లేదని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అభిమానులు తమ అభిమాన నటికీ ఇలాంటి కష్టం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య నుండి ఆమె కోలుకొని బిడ్డకు జన్మనివ్వాలని దేవుని ప్రార్థిస్తున్నారు మరి కొంతమంది అభిమానులు.