Nayanatara Wedding: తెలుగు సినీ ప్రియులకు అందాల భామ నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆపై పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసింది.
ఇక కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. అక్కడ కొంత కాలంగా కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి రిలేషన్ లో ఉంటుంది. ఆ రిలేషన్ కాస్త ఇప్పుడు పెళ్లి పీటల వరకూ తీసుకొని వెళ్ళింది. కాగా ఈ నెల 9న ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరుపు కుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహాబలిపురంలో ఒక ఫైవ్ స్టార్ట్ హోటల్ లో వీరిద్దరి పెళ్లి జరగబోతుంది అని తెలుస్తుంది.
Nayanatara Wedding: నయనతార విగ్నేష్ శివన్ ల పెళ్లి వీళ్లందరి సమక్షంలో జరుగుతుందట!
తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7:00 సమీపంలో విగ్నేష్ తన ప్రియురాలి అయినటువంటి నయన్ మెడలో తాళి కట్టబోతున్నాడు అన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు, పలు రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నట్లు కొన్ని వార్తల ద్వారా తెలుస్తుంది. ఇక రాజకీయ నాయకుల కోసం గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక జూన్ 9 న జరగబోయే ఈ పెళ్లికి స్త్రీమింగ్ హక్కులను NETFLIXలో షూట్ చేసి ప్రీమియర్ గా స్త్రీమ్ చేసారని ఇన్ సైడ్ టాక్ నడుస్తుంది. ఇక దీనికి దర్శకత్వ బాధ్యతలు గౌతమ్ మీనన్ కు అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే నిజమైతే ఈ జంట వివాహాన్ని నేరుగా ఓటీటీ లో చూసే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఊహాగానాల వెనుక నిజం ఎంత ఉందో అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే మీరు కూడా చూడటానికి రెడీగా ఉండండి.