Viral Video: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల సీజన్ ఎక్కువైపోయింది.. కరోనా తర్వాత కొంచెం ఎడతెరిపి రావడంతో పెళ్లిళ్లు వరుసగా జరుగుతున్నాయి. అనుకున్న విధంగానే సాంప్రదాయబద్ధంగా జరుపుతూ.. ఇతర దేశాల వారు మన పెళ్లిళ్ల యొక్క సంప్రదాయాలు మీద మరింత ఇంట్రెస్టింగ్ ఉండేలా మనదేశంలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
ఇక గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు పెళ్లిళ్ల సమయంలో చాలావరకు మార్పులు కూడా తీసుకొని వచ్చారు. ప్రస్తుతం పెళ్లిళ్లలో రంగురంగుల తోరణాలు అలంకరింపు తో పాటు డీజే పాటలు, అదిరిపోయే స్టెప్పులతో పెళ్లి వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. కొన్నిసార్లు వధూవరులు కూడా డీజే పాటలు స్టెప్పులు వేస్తూ వచ్చిన బంధువులను స్నేహితులను ఆశ్చర్య పరుస్తున్నారు.
దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చాలా వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్లలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. మరి కావాలని చేస్తున్నారా? లేక అనుకోకుండా ఇలాంటి విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయో..లేదో తెలియదు కానీ నెట్టింట్లో బయటపడుతున్నాయి.
Viral Video: పెళ్లి చేసుకున్న వధూవరులు కారులో ఇంటికి వెళ్లకుండా ఈ పని చేశారు!
విచిత్రమైన సంఘటనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఇదే నేపథ్యంలో ఇద్దరు వధూవరుల వీడియో నెట్టింట్లో హడావిడి చేస్తుంది. ఇద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి జరుపుకున్నారు. ఇక కారులో ఇంటికి వెళుతున్న క్రమంలో కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు ఏమో? ఆ కారు దిగి ఇద్దరూ కారు వెనకాల విచిత్రంగా పరిగెడుతున్నారు. ఇక ఆ పెళ్లి పెద్దలు, స్నేహితులు ఆ ఇద్దరి దంపతులను చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఇక అక్కడ స్థానికులు, ఈ జంటను చూసి వారి వెంట పరిగెడుతున్నారు. ఇక ఈ జంట చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.. మరి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆ వీడియో వైపు ఓ లుక్కెయ్యండి.