Niharika: ఏంటో.. ఒక్క మెగాస్టార్ తో పది, పన్నెండు కుటుంబాలు బతికేస్తున్నాయ్.. అన్ని ఆయనే చేసుకుంటాడట!

Akashavani

Niharika: తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాలు పైగా నటించి నటనలో తనకంటూ చెరగని ముద్రవేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఎందరో అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి టాలీవుడ్ అగ్ర స్టార్ హీరో గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవికి.. తన ఫ్యామిలీకి మాయని ఒక మచ్చ పడిందని చెప్పవచ్చు. ఇంతకీ అదేమిటంటే.. మెగా ప్రిన్స్ నాగబాబు కూతురు ను ఇటీవలే పబ్ వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. అప్పటి నుంచి నిహారిక అడపాదడపా వార్తల్లో నానుతూనే ఉంది.

ఈ క్రమంలోనే నిహారిక ను సోషల్ మీడియాలో కూడా పలు రకాలుగా దెప్పి పొడుస్తున్నారు. మొత్తానికి నిహారిక ఈ ట్రోల్స్ ను లైట్ తీసుకుంటూ.. తన పని తాను చేసుకుంటూ వస్తుంది. ఇదిలా ఉంటే నిహారిక తన తల్లి పద్మజ కొణిదెల ఇద్దరూ కలిసి ఓ మీడియా ఛానెల్ తో చిట్ చాట్ చేసారు.

మదర్స్ డే సందర్బంగా తల్లి కూతుర్లు ముచ్చట పెట్టారు. ఆ క్రమంలో తన తల్లికి నిహారిక మీద వచ్చే వార్తలు, ఇష్యూ లా మీద అమ్మగా మీరు ఎలా రియాక్ట్ అవుతుంటారు? అన్న ప్రశ్న ఎదురవుతుంది. దీనికి పద్మజా మాట్లాడుతూ.. ఇలాంటి వార్తలకు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కానీ మేము ఉన్నదానికి ఇలాంటివి తప్పవులే అని అనుకున్నాను.

Niharika: పద్మజ మా బావగారు అంటూ.. చిరంజీవి గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది!

ఇక తప్పు చేయనంతవరకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిహారిక ఏంటో మా వాళ్లకు తెలుసు. మాకు మా బావ గారు ఉన్నారు.. మా బావగారు ఉన్నంతవరకు మాకేం పర్వాలేదు అంటూ పద్మజ కొణిదెల వెల్లడించింది. ఇక ఈ విషయం తెలిసిన మెగా మెగా స్టార్ అభిమానులు మెగా ఫ్యామిలీలో 12 కుటుంబాలు చిరు ఉన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నాయి అని ఆలోచన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -