Nirupam Paritala: తెలుగు బుల్లితెర నటుడు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నాడు నిరుపమ్. అయితే బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటించినప్పటికీ కార్తీకదీపం సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ను పాపులారిటీని సంపాదించుకున్నాడు. కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు క్యారెక్టర్ లో నటించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులలో చెరగని ముద్రను వేసుకున్నాడు.
ఇకపోతే ఇదిలా ఉంటే కార్తీకదీపం సీరియల్ నుంచి వెళ్లి పోయినా కూడా ఫేస్ బుక్,యూట్యూబ్ ఛానల్ లలో రకరకాల వీడియోలు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు చేరువగా ఉంటున్నాడు.
కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెర స్టార్ హీరోగా కూడా గుర్తింపు పొందాడు. కార్తీకదీపం సీరియల్ లో నటించిన తర్వాత అతని ఒరిజినల్ పేరు కంటే ఎక్కువగా డాక్టర్ బాబు అన్న పేరునే చాలామంది గుర్తు పెట్టుకున్నారు. ఇకపోతే నిరుపమ్ బుల్లితెర నటి మంజులను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మంజుల కూడా పెళ్లికీ ముందు కూడా పలు సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. పెళ్లి అయిన తర్వాత ఆమె నటనను కంటిన్యూ చేస్తూ సీరియల్స్ నటిస్తూనే ఉంది. దంపతులకు ఒక బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇదే కార్తీకదీపం సీరియల్ లో నిరుపమ్ పాత్ర ముగిసిన తరువాత నిరుపమ్ సీరియల్స్ కి దూరంగా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన విషయాలను పంచుకుంటూనే ఉన్నారు.
Nirupam Paritala: యూట్యూబ్ కే పరిమితం అవుతారా..
ఇక యూట్యూబ్లో వారు వీడియో అప్లోడ్ చేయగానే గంటల వ్యవధిలో ఉన్న లక్షల్లోనే వ్యూస్ వస్తున్నాయి. ఆ వీడియోలలో మంజుల, నిరుపమ్ ఎంతో ఆనందంగా ఒకరిపై మరొకరి పంచులు వేసుకుంటూ వారు నవ్వుతూ ప్రేక్షకులు నవ్విస్తూ అలరిస్తున్నారు. అంతేకాకుండా వీరి వీడియో లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోని తాజాగా ఈ జంట ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో భార్య మంజులతో కలిసి నగలు కొనుగోలు చేయడానికి వెళ్ళాడు నిరుపమ్. అయితే ఈ వీడియోని చూసిన అతని అభిమానులు ఆ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇకపై సీరియల్స్ లో నటించరా! ఇలానే జీవితాంతం యూట్యూబ్ వీడియోలకే పరిమితం అవుతారా అని ప్రశ్నించారు? మరి ఈ విషయంపై నిరుపమ్ పరిటాల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.