Nutan Prasad: నూతన ప్రసాద్ అసలు పేరు తడి నాధ వరప్రసాద్. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు మరియు ప్రతినాయకుడు. ఈయన 1945 డిసెంబర్ 12వ తేదీన కృష్ణాజిల్లాలో జన్మించారు. బందరులో ఐటిఐ చదివిన ప్రసాద్ గారు నాగార్జునసాగర్, హైదరాబాద్ లలో ఉద్యోగాలు చేశారు. నూతన ప్రసాద్ గారిని తెలుగు ఇండస్ట్రీలో అందరూ నూటొక్కా జిల్లాల అందగాడిగా పిలిచేవారు.

హెచ్ఎఎల్ లో ఈయన ఉద్యోగం చేస్తున్నప్పుడు రంగస్థలం నటుడు, దర్శకుడైన భాను ప్రకాష్ పరిచయం అయ్యారు. భాను ప్రకాష్ స్థాపించిన కళారాధన సంస్థ తరపున వచ్చిన కొన్ని నాటకాల ద్వారా నూతన ప్రసాద్ గారు నాటక రంగానికి పరిచయమయ్యారు. అప్పటివరకు ఉద్యోగం చేస్తూనే నాటకాలలో ప్రదర్శన చేస్తూ వస్తున్న నూతన ప్రసాద్ 1973లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏఎన్ఆర్ నటించిన అందాల రాముడు సినిమా తో సినీ రంగ ప్రవేశం చేశారు.

ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ముత్యాలముగ్గు చిత్రంలో రావు గోపాలరావు తో పాటు విలన్ గా నటించడంతో ఆ గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో వచ్చిన గుర్తింపుతో చాలా సినిమాలలో విలన్ పాత్రలు కూడా వచ్చాయి. ఈయన నటన శైలితో విలన్ గా నటించిన కామెడీని పండించేవారు. అప్పటి అగ్ర
హీరోలైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి వీళ్ళతోపాటు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలలో నటించారు.

Nutan Prasad:  నూతన ప్రసాద్ జీవితంలో ఇన్ని కష్టాల..

ఈయనకు 1984లో నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం కూడా లభించింది. నూతన ప్రసాద్ గారి 365వ సినిమా బామ్మ మాట బంగారు బాట షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడి అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, నూటొక్కా జిల్లాల అందగాడిని అనే డైలాగులు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. నూతన ప్రసాద్ గారు ఒక సీరియల్ లో కూడా నటించారు. ఆయన 2011 మార్చి 30 వ తేదీన హైదరాబాద్ లో అనారోగ్యంతో మృతి చెందారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on సెప్టెంబర్ 12, 2022 at 3:15 సా.