కొరటాలతో మాకు వదంటున్న పవన్ ఫాన్స్!

Akashavani

తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్ ఆపై పలు సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.

ఇక పవర్ స్టార్ పేరు వింటేనే యువతుల కు సైతం గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు. తను నటించిన సినిమాల్లో ప్రత్యేక మ్యానరిజం కనపరిచేవాడు. ఇక అతి తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ టాలీవుడ్ లో పవర్ స్టార్ క్రేజ్ మాత్రం మరో లెవెల్లో దూసుకుపోయింది. మొత్తానికి పవన్ టాలీవుడ్ స్టార్ హీరోలలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇక ఇటీవల బీమ్లా నాయక్ సక్సెస్ తో కొంత కాలం చిల్ అయినా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ పరంగా బిజీగా ఉన్న సంగతి మనకు తెలుసు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొరటాల శివ ను ఒక రేంజ్ లో ఆడిపోసుకుంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే? కొరటాల శివ పవన్ కళ్యాణ్ కాంబోలో ఒక సినిమా వస్తుంది అన్న వార్తలను పవన్ ఫ్యాన్స్ అంగీకరించలేక పోతున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కొరటాల శివ తో మాకు వద్దు అనడానికి కారణం ఇదే!

మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమాకి చాలావరకు నెగిటివ్ టాక్ వచ్చింది. కాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొరటాల శివ పై పవన్ కళ్యాణ్ తో సినిమా వద్దు మహాప్రభో అంటూ సోషల్ మీడియా మీమ్స్ రూపంలో ఆడిపోసుకుంటున్నారు. ఇక కొందరు నెటిజన్లు.. ఎందుకు మరో ఆచార్య తీయాలనా? అంటూ దెప్పిపొడుస్తున్నారు.

ఇక ఈ ట్రోల్స్ కు డైరెక్టర్ కొరటాల శివ సోషల్ మీడియాలో ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి. ఇక కొరటాల శివ కు సంబంధించిన ట్రోల్స్ సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వైరల్ గా మారాయి. ఇక మీరు కూడా ఆ మీమ్స్ చూసి చిల్ అవ్వండి.

- Advertisement -