Pawan Kalyan: మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. ఈ రెండు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచంలోని తెలుగు అభిమానులు ఏ దేశంలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వారికి చెప్పలేని అభిమానం. అలాగే మన మెగా ఫ్యామిలీ అంటే అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. అలా తాజాగా మెగా ఫ్యామిలీ గురించి ఎందుకు ఈ న్యూస్ అంటే..
సెప్టెంబర్ 2 తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన గత కొన్ని సంవత్సరాల క్రితం జనసేన పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలని బలమైన సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. అలాగే పవర్ స్టార్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక పవన్ సినిమా ఒకటి షూటింగ్ మొదలైనప్పుడు నుంచి ఆయన అభిమానులు చెప్పలేని సంతోషంతో ఉన్నారు. ఇంతకు ఆ సినిమా ఏదో కాదు.. హరిహర వీరమల్లు.
ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కులాల ప్రస్తావన మొదలైంది. నితిన్ సినిమా మాచర్ల నియోజకవర్గం దర్శకుడు గతంలో ఒక సామాజిక వర్గంపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ వర్గానికి చెందిన అభిమానులు ఆ సినిమాను బాయ్ కాట్ చేశారు.
అలాగే రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా దర్శకుడుని కూడా కొంతమంది అభిమానులు బాయ్ కాట్ చేశారు. గత కొన్ని రోజులుగా మెగా సినిమాలు చేస్తున్న దర్శకులు కూడా డిజాస్టర్ సినిమాలను తీసి ఫ్యాన్స్ ను ఆందోళనలో పడేస్తున్నారు. ఎందుకంటే మెగా సినిమాలైనా వినయ విధేయ రామ, ఆచార్య సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా డిజాస్టర్ అయ్యాయి.
Pawan Kalyan: ఆందోళనలో మెగా అభిమానులు..
అయితే ఈ సినిమా తీసిన దర్శకులు గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు కావడంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు దర్శకుడు హరీష్ శంకర్ కూడా గుంటూరు జిల్లాకు చెందిన వాడే అందువల్ల ప్రస్తుతం మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరి ఆ గుంటూరు సెంటిమెంటుతో అక్కడ సినిమాను థియేటర్ లో విడుదల చేస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.