Sri Reddy: నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా.. శ్రీరెడ్డికి ప్రపోజల్ పెట్టిన రాఖీ బాయ్!

Akashavani

Sri Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా , సంచలన తారగా పేరు సంపాదించుకున్న శ్రీరెడ్డి గురించి అందరికీ సుపరిచితమే.ఈమె కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ తన దైన శైలిలో తనకు తోచిన విధంగా మాట్లాడుతూ వివాదం సృష్టిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎలాంటి వీడియో పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈమె వంట వీడియోలను చేస్తూ వాటిని యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఈ విధంగా శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ రోజురోజుకు అభిమానులను పెంచుకుంటున్నారు.ఇకపోతే తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంచక్క సాంప్రదాయ దుస్తులలో పట్టు పరికిని ధరించి ఆవుకు గడ్డి వేస్తూ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.ఇలా సాంప్రదాయబద్ధంగా శ్రీ రెడ్డిని చూడటంతో పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ ఫోటోపై కామెంట్లు చేశారు.

Sri Reddy: డార్లింగ్ అంటూనే…

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఏకంగా ఈ ఫోటో పై స్పందిస్తూ.. ఐ లవ్ యు శ్రీరెడ్డి డార్లింగ్ అంటూనే.. తనని పెళ్లి చేసుకుంటావా అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను రచ్చ చేస్తున్నారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం గోవా వెళ్లిన శ్రీరెడ్డి గోవా అందాలను చూపిస్తూ వీడియో చేశారు. అలాగే చేపల పులుసు కూర వండి అనాధలకు భోజనం పెట్టడంతో ఎప్పుడు పచ్చి బూతులు మాట్లాడుతూ అందరికీ లెఫ్ట్ రైట్ ఇచ్చే శ్రీ రెడ్డిలో కూడా మంచి మనసు దాగి ఉంది అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

- Advertisement -