Rana: టాలీవుడ్ ప్రేక్షకులకు రానా దగ్గుబాటి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రానా.. ఆ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో యనలేని గుర్తింపు తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.
ఇక రానా దగ్గుబాటి విరాట పర్వం అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాడు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ మరింత స్పీడ్ పెంచారు. ఇక ఇప్పటికే ఆ సినిమాలో ఒక పోస్టర్ తో పాట ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ లో కేవలం సాయి పల్లవి మాత్రమే కనిపించేలా రానా ఫొటో కనపడకుండా కట్ చేశారు. ఈ పోస్టులు చూసిన ఒక నెటిజన్ ఎలా స్పందించాడు అంటే? ఛీ దరిద్రం సొంత బ్యానర్లో ఫేస్ కట్ చేశారు.
ఇక బయట వాళ్ళు వేలెత్తి చూపించడంలో తప్పేమీ లేదు అని అన్నాడు. సినిమాలో తక్కువ నిడివి పాత్రలు చేయడం.. అందరికీ లోకువ అవ్వడం రానా స్టైల్ అని అన్నాడు. దీనికిగాను రానా స్పందిస్తూ మనం తగ్గి కథను హీరోయిన్ కి ఎలివేట్ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్.. అది కేవలం సొంత బ్యానర్లోనే జరుగుతుంది అని రానా ఆ నెటిజన్ కి కౌంటర్ ఇచ్చాడు.
Rana: ఆ పిల్లని బంగారం అంటావేంటి రానా అని అడిగింది వీళ్ళే!
ఇక రానా సాయి పల్లవి కోసమే సినిమా తీసాం రా బాబూ అని ప్రమోషన్ లో ఒక వీడియోలో తెలిపాడు. దీనిపై హీరోయిన్ అభిమాని ఈ విధంగా స్పందించింది. తెలుగు ఇండస్ట్రీలో ఇంత ప్రోగ్రెసివ్ మాటలను తట్టుకోలేదు. మీరు తమిళం మలయాళం ఇండస్ట్రీలో పుట్టాల్సింది అని అని అంటుంది.
దానికి రానా స్పందిస్తూ తెలుగు ఇండస్ట్రీ అంత ప్రొగ్రెసివ్ ప్లేస్ ఇంకెక్కడా లేదు బంగారం అని అంటాడు. ఇక రానా మీ మాటలు విన్న కొందరు నెటిజన్లు ఆ అమ్మాయిని బంగారం అంటావ్ ఏంటి? రానా అంటూ కామెంట్ల రూపంలో అడుగుతున్నారు.