Serial Actress: తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉదాంతాలు చాలానే ఉన్నాయి. తెరపై నటించే వాళ్లను కమిట్మెంట్ నుండే తీసుకున్న బాగోతాలు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంటాయి. ప్రస్తుతం మనసు మమత సీరియల్ నటి భార్గవి అలియాస్ దివ్య తెలుగు ఇండస్ట్రీలో తనకు ఎదురైనా అనుభవాలను వెల్లడించింది. ఈమె ఇండస్ట్రీలోకి రావడానికి చాలా కష్టపడిందని ఆమె చెప్పకు వచ్చింది. ఓంకార్ హోస్ట్ గా చేసిన ఆట షో తో డాన్సర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన దివ్య డాన్స్ జోడితో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మగధీర తో ఇంకా పాపులర్ అయ్యింది. అయితే ఆ తర్వాత బుల్లి తెర లోకి అడుగు పెట్టింది. లేడీ విలన్ గా సీరియల్స్ లో నటించగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమెను విలన్ గా చూసిన ప్రజల్లో మంచి గుర్తింపు ఉందనే చెప్పాలి. మనసు మమత, రంగుల రాట్నం, ముద్దు బిడ్డ, చదరంగం వంటి సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. మొదటగా ఈమె ముద్దు బిడ్డ లో ఓ నెగటివ్ రోల్ చేసింది. ఆ పాత్రలో ఈమె నటనను చూసి ఆ తర్వాత సీరియల్స్ లో కూడా నెగటివ్ రోల్స్ ఏ వచ్చాయి.
అయితే ఒక సారి నెగటివ్ రోల్స్ లో చేరితే తర్వాత కూడా ఆ పాత్రలకు అవకాశాలు రావడం సహజం . ఈ విధంగా ఈమెకు అన్ని నెగటివ్ రోల్స్ వచ్చాయి.
అయితే తాజాగా దివ్య టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యు పై ఓపెన్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ సీరియల్స్ లో మనం ఒక పాత్ర చేస్తే ఆ తర్వాత కూడా అదే పాత్ర చెయ్యాల్సి ఉంటుంది. అందం, ఏజ్, ఫిజిక్ ఇవన్నీ సీరియల్స్ లో చూడరు.
అందుకే ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. నాకు కూడా అలాంటి ఆఫర్లు వచ్చాయి.
అయితే మేనేజర్ తో నేను ముందుగానే చెప్పేశాను. అలాంటి వాటికి నేను ఒప్పుకోను. అలాంటివన్నీ నాకు వద్దు అని నేను చెప్పేసాను. ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది ఏదో బిజినెస్ లా మారిపోయింది. వస్తావా రావా అని వాళ్ళు అడుగుతారు. వెళ్లడం వెళ్ళలేకపోవడం మన ఇష్టం. మీరు నో చెప్తే వాళ్ళు ఏం చేయరు.. ఓకే అన్నారంటే అది వాళ్ళ ఇష్టం.. వద్దు అంటే ఫోర్స్ చేయరు. ఇండస్ట్రీకి వస్తే ఆ తప్పు చేయాలని రూలేమీ లేదు ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని కాదు అని దివ్య చెప్పుకొచ్చింది.
Serial Actress: కమిట్మెంట్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసిన సీరియల్ నటి..
ఒకవేళ కమిట్ అయ్యారే అనుకోండి రెండు మూడు సార్లు పిలుస్తారు. ఆ తర్వాత మీకు బాయ్ బాయ్ చెప్పేస్తారు. మీ ప్లేస్ లో మరొకరు వచ్చేస్తారు వాళ్లకు కావాల్సింది అదే కాబట్టి దానికి ప్రాధాన్యత ఇస్తారు. వాళ్లకి కావాల్సింది తీసుకొని మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు అని తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని పంచుకొని వచ్చేతరం సీరియల్ నటులకు సందేశాన్ని ఇచ్చింది దివ్య.