Vijay Babu: మలయాళ సినీ నటుడు నిర్మాత విజయ్ బాబు పై లైంగిక ఆరోపణలు చేస్తూ కోజికోడ్ జిల్లాకు చెందిన ఓ మహిళ ఎర్నాకులంలోని సౌత్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. అవకాశాలను ఎరగా వేసి ఆ నటుడు తనని ఎర్నాకులంలో ఉన్న తన ఫ్లాట్ లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆ యువతి లైంగిక వేధింపులపై ఆ నటుడు పైకేసు నమోదు చేయడంతో పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇలా ఈ కేసు విషయంలో పోలీసులు సదరు నిర్మాతను ప్రశ్నించకపోయినప్పటికీ ఆయన ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అసలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా విజయ్ బాబు మీడియా ఈ సమావేశంలో మాట్లాడుతూ…తన గురించి ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తన గురించి ఆ మహిళ తప్పుడు వ్యాఖ్యలు చేస్తోంది అంటూ ఆయన ఆరోపించారు. ఇలా నా గురించి తప్పుగా మాట్లాడటంతో ఆ యువతి పై పరువు నష్టం దావా వేస్తానని విజయ్ బాబు వెల్లడించారు.నా గురించి విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేసిన ఆ అమ్మాయిని ఏమాత్రం వదిలిపెట్టని నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తనకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Vijay Babu: స్క్రీన్ షాట్ లే ఆధారం…
ఆ అమ్మాయి తనకు 2018 నుంచి తెలుసు. ఒక ఆడిషన్ కోసం వచ్చినప్పుడు తనకు నేనే అవకాశం కల్పించానని దాన్ని ఆసరాగా తీసుకుని తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని వెల్లడించారు. ఆమె ఎంతో డిప్రెషన్ లో ఉన్నానని తరచు తనకు మెసేజ్ లు పంపేది డిసెంబర్ నుంచి జనవరి వరకు మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఏకంగా నా దగ్గర నాలుగు వందల స్క్రీన్ షాట్ లో ఉన్నాయని,తన గురించి ఈ విధంగా వస్తున్నటువంటి ఆరోపణలకు సాక్ష్యాలుగా నిలబడతాయని విజయ్ బాబు మీడియా సమావేశంలో తన గురించి వస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టారు. వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చి సొంత నిర్మాణ సంస్థలో పలు చిత్రాలను నిర్మించి నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి నిర్మాత పై ఇలాంటి ఆరోపణలు చేయడంతో ఈయన మీడియా సమావేశంలో ఆ యువతికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరి వీరి వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది.
Malayalam actor-producer Vijay Babu denies sexual assault allegations against him
"I am not afraid as I did not do anything wrong. I am the victim here. I have known the woman since 2018 who has put allegations against me" he said
(Screenshot of Actor's Facebook live) pic.twitter.com/QSyZw56Zkq
— ANI (@ANI) April 27, 2022