Sitara: ఆహా సీతారా.. నీ డ్రీమ్ మాములుగా లేదుగా.. మరి చివరికి ఏం అవుతావో చూడాలి!

Akashavani

Sitara: టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటనలో తండ్రికి తగ్గ కొడుకు గా తన వారసత్వాన్ని కాపాడుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని ప్రస్తుతం టాలీవుడ్లో ఓ వెలుగు వెలుగుతున్నాడు.

ఇక సర్కారు వారి పాట సినిమా తో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే మహేష్ బాబు కూతురు సీతారా గురించి మనందరికీ తెలుసు. ఈ బుడ్డది సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తన తండ్రి పాటల కు స్టెప్పులు వేస్తూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రూపంలో తెగ హడావిడి చేస్తుంది.

ఆ మధ్య తన తండ్రి నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కళావతి సాంగ్ విడుదల కాగానే ఆ పాటకు స్టెప్పులు వేస్తూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేసింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ యాక్టీవ్ గా ఉండే సితార.. విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Sitara: సితార డ్రీమ్ ఇదే!

ఇక సర్కారు వారి పాట ప్రమోషన్ల నేపథ్యం లో పలు టీవీ ఛానల్స్ సీతారను కూడా ఇంటర్వ్యూ చేశాయి. ఈ క్రమంలో సీతార కు నువ్వు భవిష్యత్తులో ఏమి అవ్వాలి అనుకుంటున్నావ్? నీ డ్రీమ్ ఏంటి అన్న ప్రశ్న ఎదురవ్వగా.. దానికి సీతార మాట్లాడుతూ నేను ఇంజినీరు కావాలనుకోవడం లేదు.. డాక్టర్ కావాలని కోరడం లేదు. కానీ కచ్చితంగా యాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను అదే నా డ్రీమ్ అని సితార చెప్పుకొచ్చింది.

ఇక సీతార మాటలకు ఆమె నిజంగానే ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలుగుతుంది అని చాలామంది మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఇక సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ.. పెన్నీ సాంగ్ లో సితార కూడా హడావిడి చేసింది. మొత్తానికి సితార తండ్రి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది.

- Advertisement -