Sudigali Sudheer
Sudigali Sudheer

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ అంటే బుల్లితెర పవర్ స్టార్ అని చెప్తుంటారు. జబర్దస్త్ లో కమెడియన్ గా అదరగొట్టే టైమింగ్స్ తో కామెడీని పండించి బుల్లితెర అభిమానులకు అతి తక్కువ కాలం లోనే దగ్గరయ్యాడు. మొదట్లో మెజీషియన్ గా పలు ఈవెంట్ లు చేస్తూ.. జబర్దస్త్ కు పరిచయం అయ్యాడు. జబర్దస్త్ లో రైటర్ గా చేరాడు.

తర్వాత ఇతని టైమింగ్ బాగుండటం తో వేణు సుధీర్ ని తన టీం లో చేర్చుకున్నాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో అతి తక్కువ కాలంలోనే టీం లీడర్ అయ్యాడు. అలా ఆ తర్వాత బుల్లితెర స్టార్ గా మారిపోయాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సుధీర్ గురించే టాపిక్ నడిచేదే.

కమెడియన్ గా ఉన్నప్పుడే ఒక హీరోకు ఉండే క్రేజ్ ఇతనికి వచ్చింది. అలా సుధీర్ బుల్లితెర లో బాగా ఫేమస్ అయ్యాడు. ఇక వెండితెరలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని అనుకున్నాడు. మొదట్లో సుధీర్ కు సినిమా లలో చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. ఆ తర్వాత ప్రత్యేకమైన పాత్రలు వచ్చాయి. హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు.

ఇక పోతే సుధీర్ హీరోగా నటించిన మొదటి సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. తాజాగా సుధీర్ జబర్దస్త్ మానేసిన విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ తో వివాదాల వల్లే సుధీర్ జబర్దస్త్ మానేశాడు అని వార్తలు బాగా వచ్చాయి. అయితే దీని పైన సుధీర్ ఇంకా స్పందించలేదు.

ఇదంతా పక్కన పెడితే ఇటీవలే సుధీర్ వాంటెడ్ పండుగాడ్ సినిమా లో నటించిన సంగతి తెలిసిందే. కే. రాఘవేంద్రరావు దర్శత్వం పర్యవేక్షణలో నిర్మించిన ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఈ సినిమా నిరాశ పరిచింది. భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీని వల్ల సుధీర్ కు చాలా నష్టం జరిగింది.

దీంతో ఇక పై సుధీర్ కు సినిమాలో హీరోగా అవకాశాలు తక్కువగా వస్తాయేమో అని అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం సుధీర్ ఖాతాలో గాలోడు సినిమా ఉన్న సంగతి తెలిసిందే. ఇక దీని టీజర్ కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇందులో సుధీర్ మాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఇక ఆశలు అన్ని ఈ సినిమాపైనే వున్నట్లు కనిపిస్తుంది.

Sudigali Sudheer

Sudigali Sudheer:  సుధీర్ కు నష్టం కావడానికి కారణం అదే అంటున్న అభిమానులు..

ఇక ఈ సినిమా సుధీర్ కు హిట్ ను ఇస్తుందో, లేదో చూడాలి కానీ సుధీర్ ఒకరకంగా ఇలా జరగడానికి కారణం మల్లెమాల అని కొందరు అంటున్నారు. గతంలో మల్లెమాల సుధీర్ విషయంలో అలా చేయకపోతే ఇప్పుడు ఆయనకు ఇలా జరిగేది కాదేమో అని అంటున్నారు.

Akashavani

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...