Tamannaah Bhatia: తెలుగు సినీ ప్రియులకు మిల్క్ బ్యూటీ తమన్నా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ పై పలు స్టార్ హీరోల సరసన నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఇక ఎఫ్ 2 సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తన అందాల విందును వడ్డించిన ఈ అమ్మడు ఇటీవల ఎఫ్ త్రీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తన అందాన్ని మరో స్థాయిలో ప్రేక్షకుల ముందు బయట పెట్టింది. ఇక అటు బాలీవుడ్ లో కూడా అడపాదడపా సినీ అవకాశాలు పొందుతూ.. కెరీర్ పరంగా ఒక అడుగు ముందే ఉంది.
ఇక చెప్పాలంటే మూడు పూలు ఆరు కాయలు లాగా చేతి నిండా సినిమాలతో బిజీ బిజీ అవుతుంది ఈ అమ్మడు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాల విందును ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్నా ఆస్తుల విలువ ఎంత ఉంటుంది అని తన అభిమానులు చర్చలు మొదలు పెట్టారు.

Tamannaah Bhatia: తమన్నా మొత్తం ఆస్తుల విలువ ఇంతనా!
తమన్నా ముంబైలో ఒక అద్భుతమైన ఇంటిని నిర్మించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని విలువ సుమారు పది కోట్లపైనే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇక తమన్నా పలు బిజినెస్ లకు కూడా డబ్బు పెట్టుబడి పెడుతుందని కొందరు సమాచారం ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.
ఇక ఈ అమ్మడు మొత్తం ఆస్తులు వివరాలకు వెళితే దాదాపు వంద కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు తమన్నా ను వయసు ఐపోతుంది మరి పెళ్ళెప్పుడు అంటూ.. కామెంట్ల రూపంలో దెప్పి పొడుస్తున్నారు.